TG Govt: హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్
ABN, Publish Date - Nov 28 , 2024 | 09:44 PM
వచ్చే ఏడాది అంటే.. 2025లో ఈ క్రీడలు హైదరాబాద్‌లో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తొలుత కేంద్రాన్ని కోరారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జీతేందర్ రెడ్డి వెల్లడించారు. కానీ ఈ ఖేలో ఇండియా గేమ్స్ -2025 బిహార్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో 2026లో ఈ క్రీడలు హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశాన్ని కేంద్రం కల్పించిందని చెప్పారు.
న్యూఢిల్లీ, నవంబర్ 28: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి గురువారం న్యూఢిల్లీలో వెల్లడించారు. 2026లో ఈ క్రీడలు హైదరాబాద్‌లో నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనుసుఖ్ మాండవ్యాకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారని తెలిపారు. దీనిపై కేంద్ర మంత్రి మాండవ్యా సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు.
Also Read: వైఎస్ జగన్‌కు సత్యకుమార్ సవాల్
అయితే వచ్చే ఏడాది అంటే.. 2025లో ఈ క్రీడలు హైదరాబాద్‌లో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తొలుత కేంద్రాన్ని కోరారన్నారు. కానీ ఈ ఖేలో ఇండియా గేమ్స్ -2025 బిహార్‌లో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో 2026లో ఈ క్రీడలు హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశాన్ని కేంద్రం కల్పించిందని చెప్పారు.
Also Read: టిడ్కో ఇళ్ల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ నగరం వేదికగా.. 32వ జాతీయ క్రీడలు(2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు నిర్వహించిన విషయాన్ని కేంద్రానికి రాసిన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించారన్నారు. గత పదేళ్ల పాలనతో పోలిస్తే తమ ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్‌రెడ్డి సోదాహరణగా వివరించారని తెలిపారు.
Also Read : బొద్దింక బిర్యానీ.. హైదరాబాద్‌లో కలకలం
గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్సులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, హాకీ టర్ఫ్, షూటింగ్ రేంజ్, సరూర్‌నగర్‌లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (ఎయిర్ కండిషన్డ్), సింథటిక్ టెన్నిస్ కోర్ట్, స్కేటింగ్ ట్రాక్, ఔట్ డోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియంతో పాటు టెన్నక్ కాంప్లెక్స్, ఫుట్ బాల్ గ్రౌండ్, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే సౌకర్యం, ఉస్మానియా క్యాంపస్‌లో సైక్లింగ్ వెల్‌డ్రోమ్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, స్కేటింగ్ ట్రాక్, జింఖానా-2 గ్రౌండ్‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌తోపాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులన్నీ ఉన్నాయని ఆ లేఖలో సీఎం రేవంత్ వివరించారని గుర్తుచేశారు.
Also Read : ఆగిన విశాఖ ఉక్కు ఉద్యోగుల జీతాలు..చొరవ తీసుకున్న ఎంపీ
క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఆ క్రమంలో 2018 నుంచి ప్రతి ఏటా ఖేలో ఇండియా యూత్ గేమ్స్, వింటర్ గేమ్స్, పారా గేమ్స్, యూనివర్శిటీ గేమ్స్ తదితర గేమ్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి బడ్జెట్‌లో పది రెట్ల అధికంగా క్రీడల కోసం నిధులు కేటాయింపులు పెంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కేవలం క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా క్రీడాకారులు నగరానికి చేరుకునేలా రైలు, విమాన సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు.
Also Read: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్
అలాగే నగరంలో ప్రముఖ స్టార్ హోటళ్ళు, ఇతర వసతి సౌకర్యాలు సైతం ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని కూడా తమ ప్రభుత్వం రూపొందిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు క్రీడల శాఖను స్వయంగా తానే నిర్వహిస్తున్నట్లు కూడా ఆ లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Also Read: ఆందోళన వద్దంటూ రైతులకు కీలక సూచన
ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తిని కేంద్ర మంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి క్రీడారంగంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఉందన్నారు. దేశంలో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నందుకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read:మందుబాబులను ఉరికిస్తున్న డ్రోన్లు
తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం ఆర్థికంగా మాత్రమే కాక అనేక రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రత్యేక గుర్తింపు సాధించిందని చెప్పారు. ఇకపై క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉన్నదని జితేందర్ రెడ్డి ఈ సందర్బంగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి మనుసుఖ్ మాండవ్యాతో జరిగిన ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్‌రెడ్డి, పీటీ ఉషా తదితరులు పాల్గొన్నారు.
Also Read: తిరుమల బూందీ పోటులో సిట్ తనిఖీలు
For Telangana News And Telugu News
Updated Date - Nov 28 , 2024 | 09:53 PM