Brain Surgery: ‘పుష్ప’ సినిమా చూపిస్తూ మెదడుకు సర్జరీ
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:12 AM
బేగంపేటలోని కిమ్స్- సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. ‘పుష్ప’ సినిమా చూపిస్తూ సర్జరీ చేసి రోగి మెదడులో కణతిని తొలగించారు. నిజామాబాద్‌కు చెందిన సి.బి ప్రతిప్(30) కొనేళ్లుగా బహరేన్‌కు(అరబ్ దేశం)లో ఉద్యోగం చేస్తున్నారు.
రోగి మెదడులో కణతిని తొలగించిన వైద్యులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): బేగంపేటలోని కిమ్స్- సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు ఓ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేశారు. ‘పుష్ప’ సినిమా చూపిస్తూ సర్జరీ చేసి రోగి మెదడులో కణతిని తొలగించారు. నిజామాబాద్‌కు చెందిన సి.బి ప్రతిప్(30) కొనేళ్లుగా బహరేన్‌కు(అరబ్ దేశం)లో ఉద్యోగం చేస్తున్నారు. రెండు నెలలుగా తరచూ ఫిట్స్ వస్తుండడంతో అక్కడే చికిత్స తీసుకున్నారు. అయినా నయం కాలేదు. అనంతరం బేగంపేట కిమ్స్-సన్‌షైన్ ఆస్పత్రిని సంప్రదించగా న్యూరోసర్జన్లు డాక్టర్ వేణుగోపాల్ గోక, డాక్టర్ మోహన శశాంక్ నేతృత్వంలో పరీక్షలు చేసి ప్రతిప్ మెదడులో ఎడమవైపు ట్యూమర్(కణతి) ఉన్నట్లు గుర్తించారు.
కణితి చుట్టూ ఉన్న నరాలు మాట్లాడేందుకు, అర్థం చేసుకోవడానికి సంకేతాలు పంపే నరాలు కావడంతో నావిగేషన్ గైడెడ్ అవేక్ క్రానియోటమి ద్వారా ఫంక్షనల్ న్యూరో సర్జరీ పద్ధతిలో రోగికి శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. శస్త్ర చికిత్స సమయంలో రోగిని మెలకువగానే ఉంచి అతనితో మాట్లాడుతూ, ట్యాబ్‌లో సినిమాలు, సినిమా పాటలతో పాటు కొన్ని వస్తువులు, జంతువుల ఫోటోలను చూపిస్తూ వాటి పేర్లు, విషయాలను గుర్తిస్తున్నాడా, అర్థం చేసుకుంటున్నాడా అని పరీక్షిస్తూ అవసరమైన మేర అనస్తేషియా అందిస్తూ కణతిని తొలగించారు. రెండు గంటలపాటు శస్త్ర చికిత్స కొనసాగింది. ఈ సందర్భంగా కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి సీవోవో డాక్టర్ సుధాకర్ జాదవ్ మాట్లాడుతూ.. ఆధునికి సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
Updated Date - Nov 16 , 2024 | 04:12 AM