Komati Reddy: ప్రభాకర్‌రావును తీసుకువస్తే.. కేసీఆర్, కేటీఆర్ జైలుకే
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:24 AM
ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకువస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో అడ్వాన్డ్స్ పాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్(రోడ్లపై గోతు లు పూడ్చే యంత్రం)ను ఆయన ప్రారంభించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
మొయినాబాద్ రూరల్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకువస్తే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో అడ్వాన్డ్స్ పాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్(రోడ్లపై గోతు లు పూడ్చే యంత్రం)ను ఆయన ప్రారంభించారు. అనంతరం రోడ్డుపై గుంతలను సిబ్బందితో మూసివేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రె్‌సకు ఓటేసి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని కేసీఆర్ చెప్పడం సిగ్గు చేటని అన్నారు. ఉప్పల్-ఘట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని కేసీఆర్‌పై మండిపడ్డారు. రీజినల్ రింగురోడ్డుకు కేంద్రం రూ. 30 వేల కోట్లు ఇస్తానంటే కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు.
అధికారులపై దాడు లు చేయడం సరికాదని తెలిపారు. బీఆర్‌ఎస్ వాళ్లకు రాళ్లు వేయడమే వచ్చని, తమకు మా త్రం పూలు వేయడం వచ్చన్నారు. చిలుకూరు బాలాజీ సాక్షిగా ఇక్కడి నుంచే రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని ప్రతి పల్లె నుంచి మండలానికి అక్కడి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో కృషి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణలోని 12 వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ఇటీవల మంత్రివర్గంలో చర్చించినట్లు వెల్లడించారు. ప్రతీ గ్రామానికి, తండాకు బీటీ రోడ్డు వేయడమే తన లక్ష్యమన్నారు. రెండు నెలల పాటు నిరంతరాయంగా అడ్వాన్డ్స్ పాట్ హోల్ జెట్ ప్యాచ్ మిషన్‌తో రోడ్లపై గుంతలను పూడ్చివేస్తామని చెప్పారు. అధికారులు కార్యాలయాల్లో కూర్చోకుండా క్షేత్రస్థాయిలో రోడ్లను పరిశీలించి తనకు నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేద్దామని సూచించారు.
Updated Date - Nov 12 , 2024 | 05:24 AM