ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy: రహదారులపై గుంతలు లేకుండా చేస్తాం

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:43 AM

రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసీఆర్‌ కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

  • ఆధునిక పద్ధతులతో గుంతలు పూడ్చుతాం

  • ప్రజలపై అప్పుల భారం మోపిన కేసీఆర్‌ రోడ్లపై గుంతలు పూడ్చలేదు

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రూ.7లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసీఆర్‌ కనీసం రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. గత సర్కారు చేసిన నిర్లక్ష్యం మూలంగా రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులు, అవసరమైన యంత్రాలను ఉపయోగిస్తామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరు గ్రామంలోని రహదారులపై గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన ‘‘ఎయిర్‌ ఫ్రెషర్‌ జెట్‌ ప్యాచర్‌’’, ‘‘పాట్‌ హోల్‌ అండ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ మిషనరీ’’ యంత్రాల పనితీరును మంత్రి పరిశీలించారు. ఈ యంత్రాలతో రోజుకు 10-20 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చే అవకాశం ఉందని టెక్నీషియన్లు మంత్రికి వివరించారు.


అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో 9వేల కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చుతామని, భవిష్యత్తులో రహదారులపై గుంతలు లేకుండా చేస్తామని స్పష్టంచేశారు. సంప్రదాయ పద్ధతుల్లో గుంతలను పూడ్చేందుకు అధిక సమయం పడుతుందని, అందుకే యంత్రాలతో తక్కువ సమయంలో రోడ్ల మరమ్మతులు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పర్యావరణానికి ఎలాంటి హానిలేకుండా యంత్రాలతో మరమ్మతులు చేయవచ్చన్నారు. యంత్రాలతో తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ రోడ్లకు మరమ్మతులు చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్ధిక భారం తగ్గుతుందని చెప్పారు. కాగా చిలుకూరులో గుంతలను పూడ్చే యంత్రాలను పరిశీలించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానల్‌తో మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రహదారులన్నింటినీ గుంతల మయం చేసిందన్నారు. గుంత చూపిస్తే రూ.వెయ్యి ఇస్తామంటూ గతంలో కేటీఆర్‌ ప్రకటించారని, కానీ ఇప్పుడు గుంతలు లేని రోడ్డు చూపిస్తే తాను కేటీఆర్‌కు రూ.లక్ష ఇస్తాన న్నారు.

Updated Date - Nov 12 , 2024 | 04:43 AM