ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Komatireddy: జాతీయ రహదారుల నిర్మాణంలో అలసత్వం వద్దు

ABN, Publish Date - Nov 21 , 2024 | 03:47 AM

జాతీయ రహదారులు రాష్ట్ర ప్రగతికి వెన్నెముకల్లాంటివని, వాటి నిర్మాణంంలో అలసత్వానికి తావివ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. భూ సేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ పని చేయాలన్నారు.

  • పనుల్లో వేగం పెంచండి.. ప్రతి వారం నివేదిక ఇవ్వండి

  • సమస్యలను నా దృష్టికి తీసుకురండి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులు రాష్ట్ర ప్రగతికి వెన్నెముకల్లాంటివని, వాటి నిర్మాణంంలో అలసత్వానికి తావివ్వొద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. భూ సేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ పని చేయాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను ప్రతి వారం నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్‌హెచ్‌ఏఐ తెలంగాణ రీజియన్‌ అధికారి శివశంకర్‌, అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారుల గురించి పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గతాన్ని వదిలేసి.. రోడ్ల నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. రహదారుల నిర్మాణంలో ఎలాంటి సమస్యలున్నా.. తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 24గంటలు తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. హైదరాబాద్‌-డిండి (ఎన్‌హెచ్‌-765) 85 కిలోమీటర్ల రోడ్డు అలైన్‌మెంట్‌ పెండింగ్‌లో ఉందని అధికారులు ప్రస్తావించగా.. రెండు రోజుల్లో సీఎం రేవంత్‌తో సమావేశమై అలైన్‌మెంట్‌ ఖరారు చేస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.


ఆ వెంటనే డీపీఆర్‌ను సిద్ధం చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌-విజయవాడ (ఎన్‌హెచ్‌-65) మార్గంలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్‌ పనులను పూర్తిచేయడానికి ఇంకా రెండేళ్ల కాలపరిమితి ఉందని అధికారులు చెప్పగా.. కాలపరిమితితో సంబంధం లేకుండా పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌- మన్నెగూడ (ఎన్‌హెచ్‌-163)రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలన్నారు. అలాగే, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌- 44) మార్గంలోని రెండు ప్యాకేజీలు, హైదరాబాద్‌-బెంగళూరు హైవేలోని మూడో ప్యాకేజీ పనుల గురించి మంత్రి ఆరా తీశారు. వీటి విషయంలో భూ సేకరణ పెద్ద సమస్యగా మారిందని అధికారులు తెలపగా.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వీటితోపాటు కర్నూల్‌-రాయచూర్‌ (ఎన్‌హెచ్‌-150సీ) గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు పనుల వివరాలను మంత్రి అడగ్గా.. రెండో ప్యాకేజీలో టన్నెల్స్‌ నిర్మించాల్సి ఉందని, 2025 డిసెంబరు వరకు పనులు పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ-నాగ్‌పూర్‌ (ఎన్‌హెచ్‌-163జీ) మార్గంలో భూ సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు ప్రస్తావించగా.. మంచిర్యాల, వరంగల్‌, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసి, భూ సేకరణను వేగవంతం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

Updated Date - Nov 21 , 2024 | 03:47 AM