ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Murali: అజంజాహి విషయంలో కొండా యూటర్న్‌!

ABN, Publish Date - Dec 20 , 2024 | 03:34 AM

వరంగల్‌లోని అజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

  • కార్మిక భవనం స్థలం కార్మికులకే చెందేలా చూస్తా:కొండా మురళి

వరంగల్‌సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌లోని అజంజాహి మిల్లు కార్మిక భవనం వివాదంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. 75 ఏళ్ల క్రితం మిల్లు కార్మికులు నిర్మించుకున్నయూనియన్‌ కార్యాలయ భవనం, స్థలంలో గత సోమవారం ఓ వస్త్ర వ్యాపారి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు పూనుకోగా.. దాని భూమి పూజలో వ్యాపారితోపాటు మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కార్మికుల పక్షాన ‘ఆంధ్రజ్యోతి’ అక్షర యుద్ధం ప్రకటించి వరుస కథనాలను ప్రచురించింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి నిఘా విభాగంతో మిల్లు భూమికి సంబంధించిన నివేదికను తెప్పించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర రావు యూటర్న్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. గురువారం ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనియన్‌కార్యాలయ స్థలంలో వస్త్ర వ్యాపారి చేయిస్తున్న పనులను వెంటనే నిలిపివేయించి ఆ భూమిని మిల్లు కార్మికులకే చెందేలా చూస్తానని స్పష్టంచేశారు.


తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వస్త్ర వ్యాపారి తనకు ఫోన్‌ చేసి పూజకు రమ్మంటే వెళ్లానే తప్ప వ్యాపారికి ఏదో లాభం చేకూర్చాలనికాదని చెప్పారు. ఆ స్థలం గురించి తెలుసుకోకుండా వెళ్లానని చెప్పారు. తాను కార్మికుల పక్షాన ఉండే వాడినని, వారికి న్యాయం చేయడం తన బాధ్యత అన్నారు. అవసరమైతే తాను ఆ భూమిని కొనుగోలు చేసి కార్మికులకు చెందేలా చూస్తానని స్పష్టం చేశారు. ఆ స్థలంలో ఎలాంటి పనులు జరగకుండా నోటీసులు జారీ చేయాలని తహసీల్దార్‌ కు చెప్పారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీ్‌పరావు, నగర మాజీ మేయర్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ మీడియా సమావేశం నిర్వహించారు. కొండా మురళీ రెండు మూడు రోజుల్లో కార్మిక భవన్‌ నిర్మించేందుకు నిధులు విడుదల చేయించి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ.. కార్మికులకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. కాగా మిల్లు కార్మికుల యూనియన్‌ స్థలంలో వస్త్ర వ్యాపారి అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతుండడంతో కార్మికుల పక్షాన ఆంధ్రజ్యోతి అక్షర పోరాటం చేసినందుకు మిల్లు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 20 , 2024 | 03:34 AM