ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Vishweshwar Reddy: గుర్రంపై కొండా

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:42 AM

వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దేశాన్నే అమ్ముకుంటాయని ఆరోపించారు.

  • హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీసుకు ఎంపీ

  • చేవెళ్లకు చెందిన నేతలతో కలిసి రాక

  • గుట్టలబేగంపేట భూములు లాక్కొనేలా వక్ఫ్‌ బోర్డు యత్నాలు: విశ్వేశ్వర్‌ రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ నేత, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు దేశాన్నే అమ్ముకుంటాయని ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో కలిసి గుర్రాల మీద హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి శుక్రవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు తీర్పుని ఎంతటివారైనా శిరసావహించాల్సిందేనని అన్నారు. కానీ 1995లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. సుప్రీం తీర్పు ను మించి వక్ఫ్‌ ట్రైబ్యునల్‌కు, వక్ఫ్‌బోర్డుకు విశేష అధికారం కట్టబెట్టిందని, ఆ ట్రైబ్యునల్‌ ఆదేశాలను ఏ కోర్టు కూడా ప్రశ్నించకూడదని తెలిపారు. 1995 వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 40 ప్రకారం.. ఎవరి ఆస్తినైనా తనదేనని వక్ఫ్‌ బోర్డు ప్రకటించుకోవచ్చునని, దానిని ఎవరైనా ప్రశ్నించాలంటే వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని వివరించారు.


ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకునే 107 ఏళ్లుగా హైదరాబాద్‌లోని గుట్టలబేగంపేటలో నివాసముంటున్న వందలాది మందికి చెందిన 90 ఎకరాల ను లాక్కునేందుకు వక్ఫ్‌బోర్డు ప్రయత్నిస్తోందన్నారు. సదరు భూములను ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం తమకు నోటి మాటగా బహుమతిగా ఇచ్చారని వక్ఫ్‌బోర్డు వాదిస్తోందని తెలిపారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చిందన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని స్పష్టం చేశారు. అలాగే, కొందరు నాయకులు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని ప్రజలను మోసగిస్తున్నారంటూ పరోక్షంగా రాహుల్‌గాంధీని విమర్శించారు. గడ్డం పెంచుకుని రాజ్యాంగం అంటూ వారు చూపించే పుస్తకంలో తెల్ల కాగితాలు తప్పా ఏమీ ఉండదని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.


  • మేము ఛత్రపతి శివాజీలం...

కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి.. పలువురు నేతలతో కలిసి వినూత్న రీతిలో వచ్చారు. కాషాయ పగిడీలు, ధోవతులు ధరించి కొందరు, కత్తులు పట్టుకుని సైనికుల్లా మరికొందరు, ఛత్రపతి శివాజీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తితో కలిసి గుర్రాలపై పార్టీ కార్యాలయానికి వచ్చా రు. గుట్టల బేగంపేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకుంటే వాటిని కాపాడేందుకు తాము ఛత్రపతి శివాజీ అవుతామని తెలిపేందుకు ఇలా వచ్చామని బీజేపీ నాయకులు తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నాడు కాంగ్రెస్‌ తెచ్చిన చట్టం గురించి దేశ ప్రజలకు తెలియజేయాలని వినూత్నరీతిలో పార్టీ కార్యాలయానికి వచ్చామని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Nov 16 , 2024 | 04:42 AM