ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అప్పులు పెరిగిపోయి.. చోరీలకు మరిగి..

ABN, Publish Date - Oct 30 , 2024 | 03:55 AM

వ్యాపారంలో దెబ్బతిని.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో చిత్తయి.. భారీగా అప్పులపాలై చివరికి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు చోరీలకు మరిగాడో యువకుడు.

  • వరుసగా 17 దొంగతనాలకు పాల్పడిన ఓ యువకుడి అరెస్టు

బాలసముద్రం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): వ్యాపారంలో దెబ్బతిని.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో చిత్తయి.. భారీగా అప్పులపాలై చివరికి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు చోరీలకు మరిగాడో యువకుడు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. నిందితుడు వరంగల్‌ జిల్లా రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు. సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా వెల్లడించిన వివరాల ప్రకారం.. ధర్మరాజు డిగ్రీ పూర్తి చేసి బిర్యానీ సెంటర్‌ పెట్టి నష్టపోయాడు. ఆపై హనుమకొండ పోస్టల్‌ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. వ్యాపారంలో నష్టపోయిన డబ్బును తిరిగి పొందేందుకు వ్యక్తిగత రుణాలు తీసుకొని అన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడి భారీగా నష్టపోయాడు. తీసుకున్న అప్పులు తీర్చలేక దొంగతనాల మార్గాన్ని ఎంచుకున్నాడు. తాళం వేసి ఉన్న ఇళ్లలో రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడ్డాడు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడ్డాడు.

కేయూసీ పోలీ్‌సస్టేషన్‌లో పరిధిలో 8, హనుమకొండ, హసన్‌పర్తి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 4, సుబేదారి, సంగెం, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి, దేవరుప్పుల పోలీసుస్టేషన్‌ పరిధిలో 5 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వరుస చోరీలపై అప్రమత్తమైన పోలీసులు, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌సలీమా పర్యవేక్షణలో ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని నిందితుడిపై నిఘా పెట్టారు. మంగళవారం ఉదయం చోరీ చేసిన సొమ్మును అమ్మేందుకు ధర్మరాజు కేయూసీ వైపు వస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో సీసీఎస్‌, కేయూసీ పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి రూ.28.5 లక్షల విలువైన 334 గ్రాముల బంగారం, కిలో వెండి, రూ.13వేల నగదు, ఓ బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Oct 30 , 2024 | 03:55 AM