ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhupalpally: ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు!

ABN, Publish Date - Dec 12 , 2024 | 04:02 AM

కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ) కోసం భూములు ఇచ్చి రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న ఆ కుటుంబాలు మాత్రం చీకట్లలో మగ్గుతున్నాయి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగం ఇస్తామన్న కేటీపీపీ... తన హామీని తుంగలో తొక్కడంతో నిర్వాసితులు 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు.

  • కేటీపీపీ భూ నిర్వాసితుల ఆవేదన

  • సంస్థకు విలువైన భూములు ఇచ్చినా ఇప్పటికీ వారికి ఉద్యోగాలు దక్కని వైనం

  • ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి): కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ) కోసం భూములు ఇచ్చి రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న ఆ కుటుంబాలు మాత్రం చీకట్లలో మగ్గుతున్నాయి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగం ఇస్తామన్న కేటీపీపీ... తన హామీని తుంగలో తొక్కడంతో నిర్వాసితులు 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులో నిర్మించిన 1100 మెగావాట్ల కేటీపీపీ కోసం తమ విలువైన భూములు ఇచ్చినా.. ఉద్యోగం రాక బయట బతుకుదెరువు కనిపించక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. కేటీపీపీ నిర్మాణానికి 2006లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా గణపురం మండలం చెల్పూరు, దుబ్బపల్లి, మహబూబ్‌పల్లి, గొర్లవీడు గ్రామాల పరిధిలో 975 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు.


ఎకరాకు 3 లక్షల వరకు పరిహారం చెల్లించడంతో పాటు భూములు కోల్పోయిన ప్రతి కుటుంబంలో అర్హతలను బట్టి ఒకరికి ఉపాధిని కల్పిస్తామని అప్పటి జెన్‌కో ఎండీ అజయ్‌ జైన్‌ హామీ ఇచ్చారు. 2008 జూలైౖలో 500 మెగావాట్లు, 2015లో మరో 600 మెగావాట్ల యూనిట్ల నిర్మాణాలను పూర్తి చేశారు. 2010లో మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం కాగా 2011-12లో జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) సమావేశమై భూ నిర్వాసితుల్లో కొందరికి ఉద్యోగాలు ఇచ్చింది. అయితే కేటీపీపీ రెండో దశ యూనిట్‌లో ఖాళీగా ఉన్న 127 పోస్టులను భర్తీ చేయాలని నిర్వాసిత కుటుంబాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నా సంస్థ అంతర్గతంగా సర్దుబాట్లతో కాలం గడిపేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. భూములు కోల్పోయి ఉద్యోగం రాక 50 నిర్వాసిత కుటుంబాల్లోని అర్హులు 18 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు, కాంట్రాక్ట్‌ పద్ధతిపై పనిచేస్తున్న 60 మంది తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ గోడు వెళ్లబోసుకునే స్వేచ్ఛ లేకుండా గొంతు నొక్కేశారని, ఈ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - Dec 12 , 2024 | 04:02 AM