ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రాజకీయ వ్యభిచారులు

ABN, Publish Date - Oct 26 , 2024 | 03:50 AM

జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారులేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

  • రాజీనామా చేయకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్‌ విమర్శ

సిరిసిల్ల, హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని, పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు రాజకీయ వ్యభిచారులేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేయలేదని జగిత్యాల ఎమ్మెల్యే చెబుతుంటాడని, మరి గాడిదలు కాయడానికి రేవంత్‌రెడ్డితో కండువా కప్పిచ్చుకున్నావా అని ప్రశ్నించారు. ఒకరికి విడాకులు ఇవ్వకుండా ఇంకొకరిని చేసుకోవడాన్ని వ్యభిచారం అంటారని.. ఒక పార్టీకి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే దానిని రాజకీయ వ్యభిచారం అంటారని అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో ఈఆర్‌సీ.. విద్యుత్‌ టారి్‌ఫపై బహిరంగ విచారణ నిర్వహించింది. దీంట్లో పాల్గొన్న అనంతరం విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు.


ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపండన్నారని, ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టాలని ప్రశ్నించారు. బాంబులు పేలుతాయంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఆయన మీద జరిగిన ఈడీ తనిఖీల్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికాయి. బీజేపీతో సంధి ఎలా కుదిరింది.. ఈ బాంబుల విషయం చెబుతాడా’ అని ఎద్దేవా చేశారు. కరెంటు చార్జీలు పెంచేందుకు డిస్కం ఇచ్చిన ప్రతిపాదనలు తిరస్కరించాలని ఈఆర్‌సీని కోరామని కేటీఆర్‌ తెలిపారు. 300యూనిట్ల తర్వాత యూనిట్‌ ధరను రూ.10 నుంచి 50కి పెంచాలన్న ప్రతిపాదన సరికాదన్నారు. ఉచిత విద్యుత్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తోందన్నారు. మంత్రులవేగాక విపక్ష నేతల ఫోన్లనూ సీఎం ట్యాపింగ్‌ చేయిస్తున్నారని, ఈ విషయంలో లైడిటెక్టర్‌ పరీక్షకు రావాలని సవాల్‌ విసిరారు.

Updated Date - Oct 26 , 2024 | 03:50 AM