ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: సీఎం రేవంత్‌ను ప్రజలే తరిమికొట్టే పరిస్థితి

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:37 AM

సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కమీషన్ల కోసమే కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని ఆరోపించారు.

  • కమీషన్ల కోసమే కొడంగల్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టు

  • మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపణలు

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) :సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోనే కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కమీషన్ల కోసమే కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని ఆరోపించారు. కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత దయాకర్‌ రెడ్డి, వంద మంది కార్యకర్తలు, బీఎస్పీ కొడంగల్‌ ఇన్‌చార్జి నర్మద.. తదితరలుఉ శనివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మా సిటీని తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడంగల్‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సిద్ధం కావడంతో స్థానిక ప్రజలే తరిమికొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు.


పాలమూరు ప్రాజెక్టులో భాగంగా కొడంగల్‌ నియోజకవర్గాన్ని తక్కువ ఖర్చుతో సస్యశ్యామలం చేేస ప్రణాళికలు పక్కనపెట్టి, కమీషన్ల కోసం కొడంగల్‌ లిఫ్ట్‌ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. మొన్నటిదాకా రేవంత్‌ రెడ్డి తిట్టిపోసిన ఓ ఇంజనీరింగ్‌ కంపెనీకి, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనక ఉన్న మతలబు అర్థం చేసుకోవాలన్నారు. పదేళ్లు ప్రగతిపథంలో పరుగులు పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే, కాంగ్రెస్‌ నేతల ఆదాయం పెరుగుతోందని ఆరోపించారు.

Updated Date - Oct 27 , 2024 | 03:37 AM