ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: రాజీవ్‌ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:19 AM

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినచోట కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

  • సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం

  • మేం వచ్చాక రాజీవ్‌ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినచోట కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. సీఎం రేవంత్‌ చర్యకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర సచివాలయం, తెలంగాణ అమర జ్యోతి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ విగ్రహం పెట్టడం తగదని, ఇది మన అస్తిత్వాన్ని తాకట్టుపెట్టే సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.


రేవంత్‌రెడ్డి తాను చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. లేదంటే తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కేవలం ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణ ఆత్మను తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలా? ఢిల్లీ బాసులా...? అంటే కాంగ్రెస్‌ నాయకులంతా ఢిల్లీ బాసులకే జీ హుజూర్‌ అంటారన్న విషయం మరోసారి స్పష్టమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో ఏర్పాటు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చర్య తెలంగాణలోని ప్రతి ఒక్కరి మనసును గాయపర్చేలా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని, సకల మర్యాదలతో గాంధీ భవన్‌కు తరలిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

Updated Date - Sep 17 , 2024 | 02:19 AM

Advertising
Advertising