ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: వరదలను అదుపు చేయడంలో సర్కారు విఫలం

ABN, Publish Date - Sep 02 , 2024 | 04:56 AM

వరదల పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆరోపించారు.

  • ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఉపయోగం లేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వరదల పరిస్థితిని అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఖమ్మంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. ఖమ్మంలోని త్రీటౌన్‌ వీధుల్లో నిరసనకు దిగారని, వరదల సమయంలో కనీస సాయం కోసం ప్రజలు ఆందోళన చేయడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమని విమర్శించారు.


ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా.. అక్కడి ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింన్నారు. మరోవైపు.. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అండగాఉండాలని, సాయం అందించాలని కేటీఆర్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Updated Date - Sep 02 , 2024 | 04:56 AM

Advertising
Advertising