ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా

ABN, Publish Date - Aug 17 , 2024 | 04:44 AM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు.

  • అక్కాచెల్లెళ్లను కించపర్చే ఉద్దేశం లేదు

  • ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత

  • ప్రయాణం’ వ్యాఖ్యలపై కేటీఆర్‌ వివరణ

  • కేటీఆర్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

  • 24న విచారణకు హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లను కించపర్చే ఉద్దేశం తనకు లేదన్నారు.


‘‘మనిషికో బస్సు పెడితే కుటుంబమంతా పోయి మంచిగా కుట్లు, అల్లికలు.. అవసరమైతే బ్రేక్‌ డ్యాన్స్‌లు, రికార్డింగ్‌ డ్యాన్స్‌లు చేసుకుంటారు’’ అంటూ కేటీఆర్‌ గురువారం వ్యాఖ్యానించగా.. తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల సోదరీమణులకు మనస్తాపం కలిగి ఉంటే.. విచారం వ్యక్తం చేస్తున్నానని ‘ఎక్స్‌’లో ప్రకటించారు.

Updated Date - Aug 17 , 2024 | 04:44 AM

Advertising
Advertising
<