ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కోర్టుకు కేటీఆర్‌ గైర్హాజరు..

ABN, Publish Date - Oct 19 , 2024 | 04:36 AM

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోర్టుకు రాకుండా డుమ్మా కొట్టారు.

  • అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి

హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావా కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోర్టుకు రాకుండా డుమ్మా కొట్టారు. భారత న్యాయ సంహితలోని సెక్షన్‌ 356 ప్రకారం చర్యలు తీసుకోవాలని సురేఖపై వేసిన ఈ కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు న్యాయస్థానం ఆదేశాల మేరకు కేటీఆర్‌ శుక్రవారం నాంపల్లి కోర్టుకు రావాల్సి ఉంది.


అయితే, విచారణ సమయానికి అనివార్య కారణాల వల్ల కేటీఆర్‌ రాలేకపోతున్నారని ఆయన న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. దీంతో ఆసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 23 (వచ్చే బుధవారం)కు వాయిదా వేశారు. వాస్తవానికి శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కేటీఆర్‌ కోర్టుకు వస్తున్నారని అక్కడ హైడ్రామా నడిచింది. చివరి నిమిషంలో అనూహ్యంగా ఆయన కోర్టుకు రాలేకపోతున్నారని న్యాయవాదాలు తెలపడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Oct 19 , 2024 | 04:36 AM