ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR : రాసిపెట్టుకో.. రాజీవ్‌ విగ్రహం తొలగిస్తాం

ABN, Publish Date - Sep 18 , 2024 | 05:07 AM

‘తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టి.. ఆ తల్లి ఆత్మను అవమానించావ్‌! మేం అధికారంలోకి వచ్చాక సకల మర్యాదలతో రాజీవ్‌ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం.

  • నీకిష్టమైతే జూబ్లీ హిల్స్‌లో నీ ఇంట్లో పెట్టుకో...

  • అంతేకానీ తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాదు

  • సీఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టి.. ఆ తల్లి ఆత్మను అవమానించావ్‌! మేం అధికారంలోకి వచ్చాక సకల మర్యాదలతో రాజీవ్‌ విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలిస్తాం. నీకిష్టమైతే జూబ్లీ హిల్స్‌లోని మీ ఇంట్లో పెట్టుకో! గణేశ్‌ నిమజ్జనం రోజు చెబుతున్నా.. రాసిపెట్టుకో... రాజీవ్‌ విగ్రహాన్ని సచివాలయం ముందు నుంచి తొలగిస్తాం’అని సీఎం రేవంత్‌ ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు.

అనంతరం సచివాలయం ఎదుట రాజీవ్‌ విగ్రహం ఏర్పాటును నిరసిస్తూ ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పాలతో అభిషేకం చేశారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని తాము నిర్ణయించిన స్థలంలో ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రేవంత్‌ సర్కారు రాజీవ్‌ విగ్రహం పెట్టిందన్నారు. ‘రాజీవ్‌ కంప్యూటర్‌ కనిపెట్టారని అంటున్నావు. కంప్యూటర్‌ను కనిపెట్టిన చార్లెస్‌ బాబేజ్‌ ఆత్మ బాధపడుతుందని నీకు తెలియదు’అని రేవంత్‌ రెడ్డిని విమర్శించారు. మన దేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేసింది రాజీవ్‌ కాదని, 1955లో టాటా గ్రూప్‌ సంస్థ పరిచయం చేసిందన్నారు.

రాష్ట్రంలో సరైన పాలనే లేదని, అలాంటిది కాంగ్రెస్‌ నేతలు ఈ రోజును ప్రజా పాలనా దినోత్సవమంటున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఒక్క నెలలో 30 హత్యలు జరిగినట్లు వార్తలు వచ్చాయన్నారు. రాష్ట్రానికి హోం మంత్రిని పెట్టి శాంతిభద్రతలు కాపాడాలన్నారు. ‘బిల్లులు చెల్లించక పోలీసుల వాహనాల్లో పెట్రోలు పోయించుకోలేని పరిస్థితి, సర్కారు బడుల్లో చాక్‌పీ్‌సలు కొనలేని పరిస్థితి. గురుకులాలు, వసతి గృహాల బిల్లుల పెండింగ్‌తో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. నోరుంది కదా అని 9 నెలల పాటు కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నావ్‌.. ఇప్పటికైనా పాలనపై దృష్టిపెట్టు’ అని రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ సూచించారు.

Updated Date - Sep 18 , 2024 | 05:07 AM

Advertising
Advertising