Telangana Politics: సీఎం రేవంత్ రెడ్డికి మళ్లీ కేటీఆర్ బహిరంగ సవాల్
ABN, Publish Date - Oct 25 , 2024 | 08:50 PM
గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారిని నవంబర్ 1వ తేదీ నుంచి 8 తేదీలోపు అరెస్టుల పరంపరం మొదలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వెల్లడించారు. ఆ అరెస్టయ్యే వారి జాబితాలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు సైతం ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అలాంటి వేళ.. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్‌క్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు.
హైదరాబాద్, అక్టోబర్ 25: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం సాగుతుంది. అలాంటి వేళ దమ్ముంటే కెమెరాల ముందు ఫోన్ ట్యాపింగ్ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ కాన్‌క్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే నా సవాల్ స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలన్నారు.
Also Read: Alert: వీరికే ఉచిత గ్యాస్ సిలిండర్
Also Read: భర్తను చెట్టుకు కట్టేసి.. భార్యపై ..
రేవంత్ రెడ్డి.. సొంత మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను సైతం టాప్ చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులతో పాటు నా ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని సీఎం రేవంత్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల ఫోన్‌లను కూడా ట్యాప్ చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలన్నారు. ఫోన్ టాపింగ్ విషయంలో నాతోపాటు బహిరంగంగా కెమెరాల ముందు లై డిటెక్టర్ పరీక్షకు రేవంత్ రెడ్డి రావాలన్నారు.
Also Read: ఖర్గేను అవమానించిందంటూ బీజేపీ ఆరోపణలు.. తోసిపుచ్చిన కాంగ్రెస్
Also Read: తీరం దాటిన దానా.. పోర్టుల వద్ద హెచ్చరికలు తొలగింపు
ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 50 లక్షల బ్యాగుతో పట్టుబడిన రేవంత్ రెడ్డిని దొంగ అనకుంటే ఏమంటారని ప్రశ్నించారు. నగదు కట్టలతో శాసన మండలి సభ్యులను కోనుగోలు చేయాలనుకున్న రేవంత్ రెడ్డిపైన కేసు పెట్టాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
Also Read: Telangana Politics: మా టైం బాగాలేదు.. సర్దుకు పోతున్నాం: జగ్గారెడ్డి
రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామంటూ చెప్పి ఆరు గ్యారెంటీలు కాదు హాఫ్ గ్యారెంటీలు మాదిరి అయిపోయిందంటూ రేవంత్ రెడ్డ పాలనను కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read: Allu Arjun: హైకోర్టులో అల్లు అర్జున్‌కు తాత్కాలిక ఊరట
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ అగ్రనేతలపైనే కాకుండా నాటి బీఆర్ఎస్ నేతలపై సైతం కేసీఆర్ ప్రభుత్వం పోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన పలువురు ఉన్నతాధికారులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: సోంపు తింటే ఇన్ని లాభాలున్నాయా..?
అయితే వారిలో అత్యంత కీలక పాత్ర పోషించిన పోలీస్ ఉన్నతాధికారి ప్రభాకర్‌రావు మాత్రం యూఎస్‌లో తలదాచుకున్నారు. మరోవైపు దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. దీపావళి నుంచి అరెస్ట్‌లు పరంపర ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో ఎవరెవరి అరెస్ట్‌లు జరగనున్నాయనే ఓ చర్చ అయితే తెలంగాణలో వాడి వేడిగా జరుగుతుంది.
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 25 , 2024 | 08:51 PM