ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్య ...

ABN, Publish Date - Sep 28 , 2024 | 03:51 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ(56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది.

  • కూల్చివేతల భయంతోనేనని కుటుంబసభ్యుల ఆరోపణ

  • హైడ్రాకు సంబంధం లేదన్న కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ(56) అనే మహిళ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. హైడ్రా కూల్చివేతల భయంతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడిదంటూ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి, యాదవబస్తీలో నివాసముండే శివయ్య, బుచ్చమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పాల వ్యాపారం చేసే ఆ దంపతులు పలు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత ఒక్కోక్కరికి ఒక్కో ప్లాట్‌ ఇచ్చారు.


నల్ల చెరువు పరిసరాల్లోని వెంకట్రావునగర్‌, శేషాద్రినగర్‌లోని ఆ స్థలాల్లో ఇళ్లు కట్టించి అద్దెకు ఇచ్చారు. ఇదిలాఉండగా నల్ల చెరువులోని ఆక్రమణలకు హైడ్రా అధికారులు ఇటీవల తొలగించారు. చెరువు పరిసరాల్లోని ఇతర నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేస్తుందని స్థానికంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ఇళ్లు ఎక్కడ కోల్పోతామోనని బుచ్చమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఇళ్లు కూల్చేస్తే బిడ్డల పరిస్థితేంటి అని భర్త వద్ద పలుమార్లు వాపోయింది. ఈ క్రమంలో శుక్రవారం బలవన్మరణానికి పాల్పడింది. కాగా, బుచ్చమ్మ ఆత్మహత్య వివరాలు వెల్లడించేందుకు కూకట్‌పల్లి పోలీసులు నిరాకరించారు.


కూకట్‌పల్లి మహిళ ఆత్మహత్యతో హైడ్రాకు సంబంధం లేదని, ఆ ప్రాంతంలో తాము ఎవరికి నోటిసులివ్వలేదని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌తో మాట్లాడి ఆత్మహత్య వివరాలు తీసుకున్నామని ప్రకటించారు. కూకట్‌పల్లిలోని చెరువు ఎఫ్‌టీఎల్‌కు దూరంగా వారి ఇళ్లు ఉన్నాయని, ఇళ్లు కూల్చివేస్తారన్న భయంతో కుమార్తెలు తల్లిని ప్రశ్నించినట్టు తెలిసిందన్నారు. ఈ క్రమంలోనే సదరు మహిళ ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతోన్న ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదించడం సరికాదన్నారు. హైడ్రాపై భయాందోళనలు సృష్టించేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడాన్ని మానుకోవాలని కోరారు.

Updated Date - Sep 28 , 2024 | 03:51 AM