మహిళా కమిషన్‌కు వేణుస్వామి తరపున 15 మంది అడ్వకేట్లు
ABN, Publish Date - Nov 15 , 2024 | 04:32 AM
రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జ్యోతిష్కుడు వేణుస్వామి అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఇటీవల వేణుస్వామిపై పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మరికొంతమంది కలిసి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
కమిషన్ ఎదుట హాజరుకారని చెప్పేందుకు వచ్చిన బృందం
హైదరాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జ్యోతిష్కుడు వేణుస్వామి అడ్వకేట్లు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఇటీవల వేణుస్వామిపై పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మరికొంతమంది కలిసి మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించి తమ ఎదుట హాజరుకావాలంటూ మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు పంపింది. అయితే కమిషన్ ముందు హాజరుకానంటూ ఆయన రిజిస్టర్ పోస్టు ద్వారా కమిషన్‌కు తెలిపారు.
అదే విషయాన్ని తెలిపేందుకు మళ్లీ 15 మంది అడ్వకేట్లను గురువారం కమిషన్ కార్యాలయానికి పంపారు. కమిషన్ ఎదుటకు రాలేకపోయినా ఆ విషయాన్ని చెప్పడానికి ఇంతమంది అడ్వకేట్లు అవసరమా అని కమిషన్ కార్యాలయం సిబ్బంది ప్రశ్నించారు. అడ్వకేట్ల బృందం రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అడ్వకేట్ల బృందం వ్యవహరించిన తీరు చూసి కమిషన్ సిబ్బంది విస్తుపోయారని మహిళా కమిషన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Updated Date - Nov 15 , 2024 | 04:32 AM