Hyderabad: న్యాయవాదులపై పోలీసుల దాడిని ఖండిస్తూ లాయర్ల నిరసన
ABN, Publish Date - Aug 07 , 2024 | 08:52 PM
న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ DRT (డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్) వద్ద లాయర్లు బుధవారం నిరసన తెలిపారు. ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: న్యాయవాదులపై పోలీసుల దాడులను ఖండిస్తూ DRT (డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్) వద్ద లాయర్లు బుధవారం నిరసన తెలిపారు. ఓ కేసు విషయంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని జనగామ బార్ అసోసియేషన్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జనగామ బార్ అసోసియేషన్ కోర్టు విధుల బహిష్కరణ, నిరసనలకు పిలుపునిచ్చింది.
జనగామలో లాయర్లపై దాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లోని DRT (డెబిట్స్ రికవరీ ట్రిబ్యునల్) బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీకే దేశ్‌పాండే, జనరల్ సెక్రెటరీ డి. రాఘవులు సహా పలువురు లాయర్లు నిరసన బ్యాడ్జీలు ధరించి ఆందోళనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కేసుల్లో వాదిస్తున్న న్యాయవాదులపై దాడుల పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దాడులు న్యాయవాదుల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు. న్యాయవాదులకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో టీఆర్టీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీకే దేశ్‌పాండే, జనరల్ సెక్రెటరీ డి. రాఘవులు, జాయింట్ సెక్రెటరీ కె. కల్యాణ్ చక్రవర్తి, ట్రెజరర్ అదిరన్ కిరణ్ రాజ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ సీహెచ్ కిషోర్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్(మేల్) నరేష్, శ్రవణ్ కుమార్ రాగి, ఎగ్జిక్యూటీవ్ మెంబర్ (ఫిమేల్) పి రాజేశ్వరి సహా పలువురు సీనియర్, జూనియర్ లాయర్లు పాల్గొన్నారు.
Updated Date - Aug 07 , 2024 | 08:52 PM