ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎల్‌ఈడీ బల్బులతో.. ‘నైరోబీ ఫ్లై’ కీటకాలకు చెక్‌

ABN, Publish Date - Dec 24 , 2024 | 04:43 AM

మీ ఇంట్లో నైరోబీ(యాసిడ్‌) ఫ్లై కీటకాల బెడద ఉందా? ఆ కీటకాలు ఒంటిపై పాకితే విడుదలయ్యే హేమోలిం్‌ఫతో చర్మంపై పొక్కులు, దద్దుర్లు వస్తున్నాయా? ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులను వాడితే నైరోబీ ఫ్లై కీటకాల బెడదే ఉండదట..!

  • హెచ్‌సీయూ హాస్టళ్లలో.. ఫిజిక్స్‌ విద్యార్థి పరిశోధన

  • విద్యార్థిని అభినందించిన వర్సిటీ వీసీ బీజేరావు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మీ ఇంట్లో నైరోబీ(యాసిడ్‌) ఫ్లై కీటకాల బెడద ఉందా? ఆ కీటకాలు ఒంటిపై పాకితే విడుదలయ్యే హేమోలిం్‌ఫతో చర్మంపై పొక్కులు, దద్దుర్లు వస్తున్నాయా? ఇంట్లో ఎల్‌ఈడీ బల్బులను వాడితే నైరోబీ ఫ్లై కీటకాల బెడదే ఉండదట..! హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) భౌతిక శాస్త్ర విద్యార్థి తేజస్‌ ఆంటో కనంపుళ జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. హెచ్‌సీయూలోని హాస్టళ్లలో నైరోబీ ఫ్లై బెడద ఎక్కువే. ఈ సమస్యను గుర్తించిన తేజస్‌.. వర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ బీఆర్‌ శ్యామన్నను సంప్రదించారు. హాస్టళ్లలోని సీఎ్‌ఫఎల్‌ బల్బులు, ట్యూబ్‌లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించడం వల్ల సమస్యకు పరిష్కారం లభించవచ్చనే అంశంపై వీరిద్దరూ పరిశోధన ప్రారంభించారు.


వర్సిటీ హాస్టళ్లలో 2,090 మంది విద్యార్థులుండగా.. వారిలో 209(10ు) మందిపై తేజస్‌ తన పరిశోధన జరిపారు. వీరు ఉంటున్న హాస్టళ్లలో సగం గదుల్లో ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. రెండున్నర నెలల పాటు అధ్యయనాన్ని కొనసాగించారు. ఈ రెండున్నర నెలల్లో.. సీఎ్‌ఫఎల్‌, ట్యూబ్‌లైట్‌లు ఉన్న హాస్టల్‌ గదుల్లో ఉండే విద్యార్థుల్లో 39ు మంది నైరోబీ ఫ్లై బారిన పడగా.. ఎల్‌ఈడీ బల్బులున్న గదుల్లోని విద్యార్థుల్లో బాధితులు 9శాతంగా ఉన్నారు. ఎల్‌ఈడీ బల్బుల ద్వారా ‘అతినీల లోహిత కిరణాలు-ఏ’ రేడియేషన్‌ను తగ్గించవచ్చని, దీని వల్ల నైరోబీ ఫ్లై దాడులకు చెక్‌పడుతుందని తేజస్‌ వివరించారు. ఎన్నో ఏళ్లుగా వర్సిటీలో హాస్టల్‌ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్న తేజ్‌సను, అతనికి సహకరించిన ప్రొఫెసర్‌ శ్యామన్నను హెచ్‌సీయూ వీసీ బీజే రావు అభినందించారు.

Updated Date - Dec 24 , 2024 | 04:43 AM