Kishan Reddy: భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు కలిసి పని చేద్దాం
ABN, Publish Date - Jun 13 , 2024 | 01:07 PM
బొగ్గు, గనుల శాఖ మంత్రి తనకు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు అప్పగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేడు అధికారికంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో విద్యుత్ లేకుండా, ఏ పని కూడా కాదని.. విద్యుత్ కోతల కారణంతో అనేక మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
ఢిల్లీ: బొగ్గు, గనుల శాఖ మంత్రి తనకు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు అప్పగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేడు అధికారికంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో విద్యుత్ లేకుండా, ఏ పని కూడా కాదని.. విద్యుత్ కోతల కారణంతో అనేక మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మోదీ వచ్చిన తర్వాత విద్యుత్ కష్టాలు లేవన్నారు. పవర్ మినిస్ట్రీ, రైల్వే మినిస్ట్రీ, పర్యావరణ శాఖలకు, బొగ్గు గనుల శాఖకు అనుబంధం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
అన్ని మంత్రిత్వ శాఖలను కలుపుకొని ముందుకు వెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న రోజుల్లో మనకు కావాల్సిన బొగ్గును మనం ఉత్పత్తి చేసుకుంటామని వెల్లడించారు. ఉపాధి అవకాశాలు పెంచడంపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు అందరం పని చేయాలన్నారు. ప్రధాని మోదీ దేశ ఆకాంక్షలు కోసం ముందుకు వెళుతున్న ఆయనతో పాటు అందరూ నడవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Updated Date - Jun 13 , 2024 | 01:07 PM