ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా

ABN, Publish Date - Oct 29 , 2024 | 04:45 AM

‘ధరణి’ పోర్టల్‌ సాయంతో తమ ప్లాట్లు కబ్జా చేశారని తట్టి అన్నారం సమీపంలోని మధురానగర్‌ ప్లాట్‌ యజమానులు ఆరోపించారు.

  • మధురానగర్‌ ప్లాట్‌ యజమానుల ఆరోపణలు

పంజాగుట్ట,అక్టోబరు28 (ఆంధ్రజ్యోతి): ‘ధరణి’ పోర్టల్‌ సాయంతో తమ ప్లాట్లు కబ్జా చేశారని తట్టి అన్నారం సమీపంలోని మధురానగర్‌ ప్లాట్‌ యజమానులు ఆరోపించారు. అప్పటి రంగారెడ్డి కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌ సూచనలతో తమ ప్లాట్లను ధరణిలో ఓ కంపెనీ పేరుపై మార్చారని తెలిపారు. ఇప్పుడు వాటిని చూడడానికి వెళ్తుంటే రౌడీలు బెదిరిస్తున్నారు వాపోయారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డిల పేర్లు చెప్పి హెచ్చరిస్తున్నారని తెలిపారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మధురానగర్‌ ప్లాట్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి ఆంజనేయులు, కోశాధికారి పి.నర్సింహారెడ్డి, తదితరులు మాట్లాడారు.


1978లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తట్టిఅన్నారం గ్రామంలోని సర్వే నెంబర్‌ 108, 109, 110, 111ల్లోని సుమారు 70.39 ఎకరాల భూమిని స్థల యజమానులు ఎం.సత్యనారాయణ రెడ్డి, ఎం.బాల్‌ రెడ్డిలు గ్రామ పంచాయతీ లేఅవుట్‌ ద్వారా 800 ప్లాట్లుగా చేసి విక్రయించారని తెలిపారు. వారు 1980లో ఎంవీ రంగాచారికి జీపీఏ ఇవ్వడంతో ఆయన కూడా విక్రయించాడు. మధ్యలో కొంతమంది తమ అవసరాల కోసం విక్రయించగా వేరేవారు వాటిని కొనుగోలు చేశారు. ఆ తరువాత కొందరు నకిలీ పత్రాలు సృష్టించి అది తమ స్థలమే అని చెప్పడంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు.


తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. అనంతరం తహసీల్దార్‌ ట్రైబ్యునల్‌ అప్పీలు దాఖలు కావడంతో 2012 నుంచి అది పెండింగ్‌లో ఉందని అన్నారు. 2020లో కలెక్టర్‌గా అమేయ్‌ కుమార్‌ వచ్చిన తరువాత తమకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. తహసీల్దార్‌ ట్రైబ్యునల్‌లో కేసు పెండింగులో ఉన్నప్పటికీ స్థలాలను ఆయన ధరణిలో ఓ కంపెనీ పేరు మీదికి మార్చారని ఆరోపించారు.

Updated Date - Oct 29 , 2024 | 04:45 AM