ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: కాంగ్రెస్‌తో టచ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు!

ABN, Publish Date - Dec 06 , 2024 | 04:31 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉందని, అయితే పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు.

  • పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం:మహేశ్‌

  • హస్తం పార్టీలోకి సోయం బాబూరావు, ఆత్రం సక్కు

హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరే అవకాశం ఉందని, అయితే పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకం అని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ నేతలను బీఆర్‌ఎస్‌ బెదిరింపులకు గురి చేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని మండిపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో బీజేపీకి చెందిన ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ సోయం బాబూరావు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులకు మహేశ్‌.. పార్టీ కండువాకప్పి కాంగ్రె్‌సలోకి ఆహ్వానించారు.


ఈ సందర్భంగా మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. అనంతరం సోయం బాబూరావు మాట్లాడారు.. కాంగ్రెస్‌ పార్టీ, సీఎం రేవంత్‌ మీద నమ్మకంతో తాను పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. సీఎంగా రేవంత్‌ రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. కాగా ఆత్రం సక్కు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఆసిఫాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Dec 06 , 2024 | 04:31 AM