ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: మేడిగడ్డకు రిపేర్లు చేయండి..

ABN, Publish Date - May 17 , 2024 | 03:39 AM

జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్‌ అండ్‌ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్‌ అండ్‌ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

  • ప్రభుత్వ పరిశీలనలో ఒప్పందంలోని నిబంధనలు, షరతులు.. వాటికి లోబడే చెల్లింపులు చేస్తాం

  • మేడిగడ్డపై ఎల్‌ అండ్‌ టీకి రామగుండం సీఈ లేఖ

  • అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకూ లేఖలు

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్‌ అండ్‌ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్‌ ఇంజనీర్‌ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్‌ అండ్‌ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, ఒప్పందంలోని షరతులు/నిబంధనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, చెల్లింపులు కూడా దానికి లోబడే ఉంటాయని, వానాకాలం ముంచుకు వస్తుండటంతో ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ఆధారంగా మరమ్మతులకు ఉపక్రమించాలని చీఫ్‌ ఇంజనీర్‌ కోరారు.


దెబ్బతిన్న బ్లాకులను తొలగించడం, పిల్లర్లకు ఇనుప పట్టీలు వేయడం లేదా రక్షణ చర్యలు తీసుకోవడం, గ్రౌటింగ్‌, ప్లింత్‌ శ్లాబ్‌ల మరమ్మతులు, గేట్లు తెరుచుకునేలా చర్యలు తీసుకోవడం వంటి ప్రక్రియలను తక్షణమే చేపట్టాలని వివరించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బ్యారేజీలోని 6, 7, 8వ బ్లాకులకు చెందిన ఎలకో్ట్ర రెసిస్టివిటీ టెస్ట్‌ (ఈఆర్‌టీ), గ్రౌండ్‌ పెనిట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) టెస్టుల నివేదికల ఆఽధారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్‌డీఎ్‌సఏ కమిటీ కూడా వానా కాలంలోపు బ్యారేజీల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరిందని గుర్తు చేశారు. అలాగే, మేడిగడ్డ బ్యారేజీని ఎల్‌ అండ్‌ టీ నిర్మించగా.. అన్నారం బ్యారేజీని అఫ్కాన్స్‌-విజేత-పీఈఎ్‌స జాయింట్‌ వెంచర్‌; సుందిళ్లను నవయుగ-జీఎండబ్ల్యూ జేవీలు కట్టాయి. అన్నారం బ్యారేజీ మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, నిర్ణీత వ్యవధి పెట్టుకొని.. ఆలోపు పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని అఫ్కాన్స్‌-విజేత-పీఈఎ్‌స జాయింట్‌ వెంచర్‌కు లేఖ రాయగా, సుందిళ్లపై కూడా నవయుగ-జీఎండబ్ల్యూ జాయింట్‌ వెంచర్‌కు లేఖ రాశారు.

Updated Date - May 17 , 2024 | 03:39 AM

Advertising
Advertising