ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mallareddy: రేవంత్‌రెడ్డి సీఎం అవుతారని పదేళ్ల క్రితమే జోస్యం చెప్పా..

ABN, Publish Date - Mar 17 , 2024 | 10:52 AM

రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి(Former minister Mallareddy) తనదైన శైలిలో చెప్పారు.

- కుమారుడికి కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ వచ్చినా పార్టీ మారేదిలేదు

- కవిత అరెస్ట్‌పై నో కామెంట్‌ : మాజీ మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సీఎం అవుతాడని తాను పదేళ్ల క్రితమే జోస్యం చెప్పానని మాజీ మంత్రి మల్లారెడ్డి(Former minister Mallareddy) తనదైన శైలిలో చెప్పారు. శనివారం ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో బోయినపల్లిలోని ఇంట్లోనే ఉన్న మల్లారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’ విలేకరి, మరికొందరితో సరదాగా సమావేశమయ్యారు.

‘అన్నా.. నువ్వు సీఎం అవుతావు.. ఆ చాన్స్‌ నీకు ఒక్కడికే ఉందన్న’ అంటూ మల్లారెడ్డి చేసిన వాఖ్యలపై ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై మల్లారెడ్డి స్పందిస్తూ 2014 సెప్టెంబర్‌లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కంటోన్మెంట్‌ పరిధిలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యే దివంగత సాయన్న ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో తనతోపాటుగా రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సర్వే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారని తెలిపారు. ఆ సందర్భంగా సరదా సంభాషణల్లో భాగంగా తాను, రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అప్పట్లో వార్తల్లో ప్రసారం అయిన ఈ వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోందని, రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో తనకు రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో తామిద్దరం కలిసి ప్రచారం చేసిన ఫొటోలను సైతం చూపించారు. తన కుమారుడు భద్రారెడ్డికి మల్కాజిగిరి పార్లమెంట్‌ టికెట్‌ కోసం బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ప్రయత్నాలు చేసిన మాట వాస్తవమేనన్నారు. తాను మాత్రం బీఆర్‌ఎ్‌సను వీడేది లేదంటూ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఎన్నికల్లో పోటీచేయబోనని, మేడ్చల్‌ నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నానని అన్నారు. కాగా, కవిత అరెస్టుపై ఎలాంటి కామెంట్స్‌ చేయబోనని అన్నారు.

Updated Date - Mar 17 , 2024 | 10:52 AM

Advertising
Advertising