Mallu Bhatti Vikramarka: సన్న బియ్యానికే రూ.500 బోనస్ అనలేదు.. ఆందోళన అవసరం లేదు
ABN, Publish Date - May 21 , 2024 | 01:34 PM
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క(mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు(farmers) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క(mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు(farmers) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం తడిసినా, చివరకు మొలకెత్తిన గింజలు కూడా కొంటామని వెల్లడించారు. రేటు తగ్గించకుండా కొంటామని అన్నారు.
దీంతోపాటు వరి ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తు్న్నామని చెప్పారు. ఈ అంశం ప్రతిపక్షాలకు రుచించడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేందుకు రాజకీయాలను వాడొద్దని ప్రతిపక్షాలకు డిప్యూటీ సీఎం హితవు పలికారు.
రాష్ట్రంలో అసలు ధాన్యమే(paddy) కొనుగోలు చేయడం లేదు, కల్లాళ్లలోనే ధాన్యం తడిసి ముద్దౌతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. అందులో నిజం లేదని చెప్పారు. గత ఏడాది ఇదే సమయంలో తాను పాదయాత్ర చేస్తుండగా రోడ్ల వెంట ధాన్యం కుప్పలుగా పోసి రైతులు ఇబ్బంది పడేవారని భట్టి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం కంటే 15 రోజులు ముందుగానే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా మీకంటే ఎక్కువ కేంద్రాల్లో 7,245 కొనుగోళ్లను ప్రారంభినట్లు స్పష్టం చేశారు. ఎన్ని టన్నుల ధాన్యం పండినా కూడా కొంటామని స్పష్టం చేశారు.
ఇక ధాన్యం బోనస్ విషయానికి వస్తే సన్న బియ్యానికే రూ. 500 బోనస్ అనలేదని, సన్నాలతో 500 రూపాయల బోనస్ ప్రక్రియను మొదలు పెట్టామని చెప్పారు. నాటి సీఎం కేసీఆర్(KCR) వరి వేస్తే ఊరే అని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని భట్టి అన్నారు. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లవద్దని కోరారు.
ఇదికూడా చదవండి:
Hyderabad: ఆ మున్సిపాలిటీలో.. బెడిసి కొడుతున్న కాంగ్రెస్ ప్రయత్నాలు..
Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ ప్రజలు.. జాతరను తలపించిన చెరువు..
Read Latest Telangana News and National News
Updated Date - May 21 , 2024 | 01:44 PM