ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mandakrishna: ఏం ఉద్ధరించారని సంబురాలు.. హామీల అమలులో సీఎం విఫలం

ABN, Publish Date - Nov 27 , 2024 | 10:21 AM

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా చేయూత పింఛన్‌ మొత్తం ఎందుకు పెంచలేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రశ్నించారు.

- ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ

హైదరాబాద్: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) విఫలమయ్యారని, అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా చేయూత పింఛన్‌ మొత్తం ఎందుకు పెంచలేదని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అన్నిరకాల పింఛన్లను పెంచేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: బంగారం షాపులో దృష్టి మళ్లించి దోపిడీ


వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్‌పీఎస్‌) ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద చేయూత పింఛన్‌దారుల మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఏం ఉద్ధరించారని సంబురాలు చేసుకుంటారని, డిసెంబరు 2 కల్లా అన్నిరకాల పింఛన్లు పెంచకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు. డిసెంబరు 9న కాంగ్రెస్‌ సంబురాలు జరుపుకుంటే.. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తమను మోసం చేసినందుకు నిరసన కార్యక్రమాలతోపాటు కలెక్టర్‌ కార్యాలయాలను దిగ్బంధించాలని పింఛన్‌దారులకు పిలుపునిచ్చారు.


బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని, దివ్యాంగులకు అన్ని ప్రభుత్వ శాఖల్లో నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వీహెచ్‌పీఎస్‌ అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అధ్యక్ష త వహించిన ఈ ధర్నాలో గోపాల్‌రావు, అందె రాంబాబు, సత్యనారాయణ, సామినేని భవానీచౌదరి, మంగమ్మ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు, అధికసంఖ్యలో పింఛన్‌దారులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఎముకలు కొరికే చలి

ఈవార్తను కూడా చదవండి: అమ్మకానికి చిన్నారుల అశ్లీల వీడియోలు!

ఈవార్తను కూడా చదవండి: హోటళ్లు, రెస్టారెంట్లపై 556 కేసులు

ఈవార్తను కూడా చదవండి: రేవంత్.. నీ పౌరుషం ఏమైంది.. BRS అవినీతిపై కేసులేవీ..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 27 , 2024 | 10:21 AM