Bhatti Vikramarka: కేసీఆర్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్..
ABN, Publish Date - May 07 , 2024 | 01:33 PM
రిజర్వేషన్లు ఎత్తివేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. నేడు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందన్నారు. ‘సంపద పెంచుతాం.. పంచుతాం’ ఇదే కాంగ్రెస్ నినాదమని తెలిపారు. కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వగానే బీజేపీ కుట్రలు మొదలు పెట్టిందని భట్టి విమర్శించారు.
హైదరాబాద్: రిజర్వేషన్లు ఎత్తివేయడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆరోపించారు. నేడు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందన్నారు. ‘సంపద పెంచుతాం.. పంచుతాం’ ఇదే కాంగ్రెస్ నినాదమని తెలిపారు. కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇవ్వగానే బీజేపీ కుట్రలు మొదలు పెట్టిందని భట్టి విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపట్టామన్నారు. దేశంలో అధికారంలోకి రాగానే మా ప్రభుత్వం కులగణన చేస్తుందని తెలిపారు.
KTR: పిరమైన మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!
రిజర్వేషన్లు కాపాడుకునేందుకు ఎస్సీ, ఎస్టీ ,బీసీ లు కాంగ్రెస్‌కు ఓటు వేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగం ప్రమాదంలో ఉందన్నారు. దేశంలో భయానక పరిస్థితులు ఉన్నాయన్నారు. కేసీఆర్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు బీజేపీ చేస్తున్న అన్యాయానికి కేసీఆర్ మద్దతు ఇస్తున్నారన్నారు. కేసీఆర్, బీజేపీ ముసుగు తీసేసి మాట్లాడితే మంచిదన్నారు. మోదీ ప్రధాని అయిన నాటి నుంచే రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర మొదలైందన్నారు. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి అని పేర్కొన్నారు. తెలంగాణలో మా పార్టీ 14 సీట్లు గెలుపు పక్కా అని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Konda Visveshwar Reddy: ఆటోడ్రైవర్లను మోసం చేసిన కాంగ్రెస్..
Read Latest News and Telangana News Here
Updated Date - May 07 , 2024 | 01:33 PM