ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chattisgarh: బీజాపూర్ ఎన్‌కౌంటర్లకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ABN, Publish Date - Apr 15 , 2024 | 08:17 AM

మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు భద్రతా బలగాలు పిలుపునిచ్చాయి. మావోయిస్ట్‌ల ఏరివేత టార్గెట్‌గా భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తోంది.

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు (Police) పిలుపునిచ్చారు. మావోయిస్ట్‌ల ఏరివేత టార్గెట్‌గా భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ కాల్పుల మోతతో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ దద్దరిల్లింది. వరుస ఎన్‌కౌంటర్లతో విలవిల్లాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సెంట్రల్ రీజియన్ బంద్‌కు పిలుపునిచ్చింది.

Congress: నారాయణపేటలో నేడు కాంగ్రెస్ జన జాతర సభ..


తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ (Chattisgarh) సరిహద్దు దండ కారణ్యం యుద్ధ భూమిగా మారింది. ఒక ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పెద్దగా కాలవ్యవధి కూడా లేకుండానే దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతోంది. మొన్నటికి మొన్న ఛత్తీ్స్‌గడ్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్... ములుగు జిల్లా సరిహద్దు కర్రి గుట్టల వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీస్ (Police) బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఏకే 47.. లైట్ మెషీన్ గన్,12 బోర్ తుపాకులను సోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Delhi Liquor Case: ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు కోర్టు ముందుకు..


బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ధృవీకరించారు. తెలంగాణ గ్రే హౌండ్స్... ఛత్తీస్ గడ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ సరిహద్దులో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు భారీ ఎన్ కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కోర్చోలి ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు.. ఇవాళ సరిహద్దు కర్రిగుట్టల వద్ద ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్ట్ లు మృతి చెందారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పదేళ్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం

Updated Date - Apr 15 , 2024 | 08:21 AM

Advertising
Advertising