వైమానిక దాడులు చేశారంటూ ఫోటోలతో మావో లేఖ
ABN, Publish Date - Apr 11 , 2024 | 10:26 AM
తమపై వైమానిక దాడులకు ప్రభుత్వం పాల్పడిందంటూ పోలీసులపై మావోయిస్ట్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నెల ఏడో తేదీన దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలు వైమానిక దాడులు చేశాయని ఫోటోలతో లేఖ విడుదల చేసింది.
ఛత్తీస్‌గఢ్: తమపై వైమానిక దాడులకు ప్రభుత్వం పాల్పడిందంటూ పోలీసులపై మావోయిస్ట్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నెల ఏడో తేదీన దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలు వైమానిక దాడులు చేశాయని ఫోటోలతో లేఖ విడుదల చేసింది. సౌత్ బస్తర్ మావోయిస్ట్ కార్యదర్శి గంగ పేరుతో లేఖ విడుదలైంది. పామేడు ఏరియాలో వైమానిక దాడులు చేశారని లేఖలో గంగ ఆరోపించారు. సుకుమా బీజాపూర్ జిల్లాల సరిహద్దులో రాకెట్ లాంఛర్ల దాడులతో ఆదివాసీల పల్లెలపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు.
Bharat Rice: భారత్ రైస్ వచ్చేసింది.. హైదరాబాద్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే..
తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ (Chattisgarh) సరిహద్దు దండ కారణ్యం యుద్ధ భూమిగా మారింది. ఒక ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పెద్దగా కాలవ్యవధి కూడా లేకుండానే దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. మొన్నటికి మొన్న ఛత్తీ్స్‌గడ్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్... ములుగు జిల్లా సరిహద్దు కర్రి గుట్టల వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీస్ (Police) బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఏకే 47.. లైట్ మెషీన్ గన్,12 బోర్ తుపాకులను సోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు భారీ ఎన్ కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కోర్చోలి ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు.. ఇవాళ సరిహద్దు కర్రిగుట్టల వద్ద ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్ట్ లు మృతి చెందారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Hyderabad: డిటర్జెంట్ పౌడర్ ముసుగులో స్మగ్లింగ్ గ్యాంగ్ ఏం చేసిందో తెలిస్తే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..
Updated Date - Apr 11 , 2024 | 01:03 PM