Sajjanar: ఆవేశంలో దాడులు చేసి ఇబ్బందులు పడొద్దు... వాహనదారులకు సజ్జనార్ రిక్వెస్ట్..
ABN, Publish Date - Jan 10 , 2024 | 02:58 PM
ప్రయాణికులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లకే భద్రత లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన
ప్రయాణికులను సేఫ్ గా గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లకే భద్రత లేకుండా పోతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న డ్రైవర్లకు..కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులు మరింత తలనొప్పిగా మారాయి. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెహికిల్ ను ఢీ కొట్టారంటూ.. ఓ వ్యక్తి డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ తతంగాన్నంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వరకు వెళ్లింది. వీడియోపై స్పందించిన ఆయన.. ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు చేయడం సరికాదని హితవు పలికారు.
"నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. అయినా చాలా ఓపిక, సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. కానీ దాడులు చేయడం వంటి ఘటనలు సిబ్బందిలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి దాడులను యాజమాన్యం అసలే సహించదు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురికావొద్దు." అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
కాగా. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది. బైకర్ నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. అయినా తన తప్పేం లేదంటూ ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై దాడి చేశారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారు. ఈ ఘటనపై అందోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Jan 10 , 2024 | 02:58 PM