ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress Vs BRS: గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయం ముట్టడి

ABN, Publish Date - Oct 07 , 2024 | 11:59 AM

Telangana: గజ్వేల్‌లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఆపై కళ్యాణ లక్ష్మీ , షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని...

MLA KCR Camp office

సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 7: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) క్యాంప్ కార్యాలయం వద్ద కొద్దిసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. గజ్వేల్‌లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. కేసీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. ఆపై కళ్యాణ లక్ష్మీ , షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేయాలని కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. వెంటనే కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశారు.

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తా


కేసీఆర్ కనబడుటలేదంటూ..

కాగా.. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ గజ్వేల్‌లోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. కేసీఆర్ కనిపించడం లేదంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు ఈ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఆచూకీ తెలుసుకుని నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకు రావాలని పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్పష్టం చేశారు. అనంతరం గజ్వేల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు మాట్లాడుతూ... ‘‘కేసీఆర్ మీరెక్కడ ఉన్నారు. వారం రోజుల్లో జాడ తెలుపక పోతే.. తామే కేసీఆర్ ఆచూకీ తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాం. ఎన్నికల్లో గెలిచి దాదాపు పది మాసాలు అవుతున్నా.. నేటికి గజ్వేల్ నియోజకవర్గంలో మీ జాడ లేదు. ఎమ్మెల్యేగా మీ బాధ్యతలను మరిచవా కేసీఆర్?’’ అంటూ ప్రశ్నించారు. ప్రజల సొమ్మును వేతనంగా తీసుకుంటున్నావంటూ ఈ సందర్భంగా కేసీఆర్‌కు శ్రీకాంత్ రావు గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజల కాలిలో ముల్లు దిగితే పంటితో తీస్తనన్నావు కదా.. ఆ విషయం మరిచారా? అంటూ చురకలంటించారు. ‘‘మీ యోగ క్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నిన్ను గెలిపించిన ప్రజలకు ఉంది’’ అంటూ బండారు శ్రీకాంత్ రావు స్పష్టం చేశారు.

Tirumala Free Darshan: తిరుమల వెళ్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకుంటే.. మీ దర్శనం చాలా ఈజీ..


మరోవైపు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్గో బీఆర్‌ఎస్ ఓడిపోవడం కాంగ్రెస్ గెలవడం.. ఆపై రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది. ఓడిపోయిన బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫామ్ హౌస్‌లో ఉండిపోయారు అసెంబ్లీ సమావేశాలు హాజరుకాలేదు. అంతే కాదు ఎమ్మెల్యేగా ప్రతిపక్షనేతగా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కేసీఆర్ పర్యటించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.


తెరపైకి మరో సమస్య...

మరోవైపు కళ్యాణ్ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట చెక్కుల పంపిణీలు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ చెక్కుల పంపిణీ జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కళ్యాణ్ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు ఎక్కువగా పెండింగ్‌లో ఉండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌ పథకాలకు వచ్చిన దరఖాస్తులను తొలుత తహసీల్దార్‌, ఆ తరువాత ఆర్డీవో పరిశీలిస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేసి చెక్కులను అందజేస్తారు. చెక్కులపై నిర్దేశిత తేదీని వేస్తారు. అయితే చెక్కులు పంపిణీ చేయడంలో తీవ్ర తాత్సారం చేస్తుండటంతో మరోసమస్య తెరపైకి వస్తోంది. చెక్కుల గడువు ముగిసిన తరువాత కూడా పంపిణీ చేయని దుస్థితి నెలకొనడంతో ఆ చెక్కులను బ్యాంకులకు తీసుకెళ్తే బౌన్స్‌ అయ్యాయని చెప్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. దీంతో మళ్లీ చెక్కుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేయాల్సి వస్తున్నదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 12:19 PM