ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Etela Rajender: దేశం ఆత్మగౌరవంతో బ్రతకాలంటే మోదీకే ఓటేయాలి..

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:16 PM

Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్ అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదన్నారు.

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 26: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఈటెల రాజేందర్ (Etela Rajender) అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఈటెల మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అనేక హామీలు ఇచ్చిందని.. కానీ ఇప్పటికీ ఒక్క హామీ కూడా నెరవెర్చలేదన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు దొరకని సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తన తరపున విన్నవిస్తున్నట్లు తెలిపారు.

దేశ వ్యాప్తంగా ప్రజలు పార్టీలకు అతీతంగా మోదీ (PM Modi) కే ఓటు వేస్తామని అంటున్నారన్నారు. దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బ్రతకాలంటే మోదీ కే ఓటు వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. 370 ఆర్టికల్, 500 సంవత్సరాలకు పైబడి కొట్లాడిన అయోధ్య కానీ, త్రిబుల్ తలాక్ రద్దు లాంటి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది మోదీ అని చెప్పుకొచ్చారు. ప్రపంచ చిత్ర పటంలో ఎదుగుతున్న దేశంగా ఉన్న భారత దేశాన్ని మోదీ ఎంతో గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఇతర దేశాలకు మందులు అందించిన ఘనత మోదీ దే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం తప్ప యే ఒక్క హామీ ని నెరవేర్చలేదని ఈటెల రాజేందర్ విమర్శించారు.

Updated Date - Feb 26 , 2024 | 12:16 PM

Advertising
Advertising