ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Rao: ఏడాది తర్వాత కచ్చితంగా ప్రజలు మళ్లీ మనల్నే ఆదరిస్తారు

ABN, Publish Date - Jan 02 , 2024 | 05:51 PM

బీజేపీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ( Parliament Elections ) తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ ( BRS ) కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ... ప్రభుత్వం రాలేదని నిరాశ పడవద్దని .. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని హరీష్‌రావు చెప్పారు.

సిద్దిపేట: బీజేపీ ( BJP ), కాంగ్రెస్ ( Congress ) పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ( Parliament Elections ) తగిన గుణపాఠం చెప్పాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ( Harish Rao ) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు దుబ్బాకలో బీఆర్ఎస్ ( BRS ) కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, హరీష్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌రావు మాట్లాడుతూ... ప్రభుత్వం రాలేదని నిరాశ పడవద్దని .. బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదేనని చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్షలాంటిదన్నారు. మనం ఎన్నో విజయాలు, అపజయాలు చూశాం.. మనకు పూల బాట తెలుసు, ముళ్ల బాట తెలుసునని అన్నారు. బీఆర్ఎస్ లేకుంటే తెలంగాణనే లేదన్నారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి ఒకటి కాదు.. రెండు కాదు.. 412 హామీలు ఇచ్చారని మండిపడ్డారు. కరెంట్ బిల్లు కట్టవద్దని తాము అధికారంలోకి రాగానే 200 యూనిట్లు ఫ్రీ అని కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. ఇప్పుడు మాత్రం ముక్కుపిండి మరీ కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము రాగానే రైతు బంధు 15000 రూపాయలు ఇస్తామన్నారు.. ఇచ్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రైతుల మీద ఉన్న ప్రేమ కాంగ్రెస్‌కి ఉందా అని నిలదీశారు. 4 వేల ఫించన్ ఇస్తామన్నారు.. ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9వ తేదీన 2 లక్షలు రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు రేవంత్‌రెడ్డి మాట తప్పారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై ప్రశ్నిస్తుంటే తనకు తొందరెక్కువ అని అంటున్నారు.. కాంగ్రెస్ నేతలు ఏం చెప్పారో అదే తాను గుర్తుచేస్తున్నానని ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.

.

తెలంగాణ ప్రయోజనాలు బీజేపీ, కాంగ్రెస్‌కు పట్టవు

ప్రజలతో కలిసి మెలిసి ఉందాం.. తెలిసో తెలియకో ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుందామన్నారు. భవిష్యత్తు మనదే.. కార్యకర్తలు అధైర్య పడద్దని చెప్పారు. ఏడాది తర్వాత కచ్చితంగా ప్రజలు మళ్లీ బీఆర్ఎస్‌నే ఆదరిస్తారని.. ఇప్పటికే ప్రజల్లో ఆలోచన మొదలైందన్నారు. రెండు జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం కావాలి తప్ప, తెలంగాణ ప్రయోజనాలు పట్టవని మండిపడ్డారు. తెలంగాణ రాగానే లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టు ఉన్న ఏడు మండలాలను బీజేపీ ఆంధ్రలో కలిపిందని.. దానికి కాంగ్రెస్ మద్దతును ఇచ్చిందని ధ్వజమెత్తారు. ఆ రోజు రాజ్యసభలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోతే ఆ ఏడు మండలాలు ఆంధ్రలో కలిసేవి కాదని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు పట్టవన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరడాలంటే అది బీఆర్ఎస్‌కే సాధ్యమన్నారు. బీజేపీ అడుగులకు మడుగులు వత్తే పార్టీ కాంగ్రెస్ అని హేలన చేశారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. ఇచ్చిన మాట... తప్పిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల్లో చర్చకు పెట్టాలని ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - Jan 02 , 2024 | 05:59 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising