ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలి..

ABN, Publish Date - Feb 26 , 2024 | 11:56 AM

సిద్దిపేట జిల్లా: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..

సిద్దిపేట జిల్లా: బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay)‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం సిద్దిపేట (Siddipet) జిల్లా, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ (Karimnagar) పార్లమెంట్ పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ (Bandi Sanjay) చెప్పాలన్నారు. మతపరమైన అంశాలతో ఓట్లు అడగడం కాదని.. ప్రజాస్వామ్యంగా ఓట్లు అడగాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రజాహితం పేరిట యాత్రలు చేస్తోందని విమర్శించారు. 48 గంటల వ్యవధిలో ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రూ. 10 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన ఘనత తమదేనన్నారు. రేపు (మంగళవారం) 27వ తేదీన చేవెళ్లలో రూ. 500 కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్నారు. మేము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తున్నామని, కేంద్రం నుంచి 500 రూపాయల రిఫండ్ ఎప్పుడు ఇస్తారో బండి సంజయ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Updated Date - Feb 26 , 2024 | 12:00 PM

Advertising
Advertising