ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Road Accident: ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం

ABN, Publish Date - Apr 25 , 2024 | 09:01 AM

సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..

Road Accident, Sangareddy.

సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road)పై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆగి ఉన్న లారీ (Lorry)ని వెనుకనుంచి కారు (Car) ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా (Sangareddy Dist.), ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు, ఎగ్జిట్ 3 వద్ద లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. మంటలు లారీకి అంటుకున్నాయి. లారీ పాక్షికంగా దగ్ధమైంది. కారు డ్రైవర్‌తోపాటు మరొకరు సజీవ దహనమయ్యారు. దీంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ (ORR) రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కారు పూర్తిగా దగ్దమవడంతో కారు నెంబర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


మరోవైపు సూర్యాపేట జిల్లా, కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్ (Hyderabad)- విజయవాడ (Vijayawada) 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆగి ఉన్న లారీ (Lorry)ని వెనుక నుంచి కారు (Car) ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు.


అతి వేగం, నిద్రలేమి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

జగన్‌కు ఈసీ మరో షాక్

జగన్‌ అరెస్టు ఖాయం

దళితులపై దౌష్టికం!

మండుతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News and Crime News

Updated Date - Apr 25 , 2024 | 09:06 AM

Advertising
Advertising