ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ramcharan: ఆర్టీవో కార్యాలయంలో మెగా పవర్ స్టార్ సందడి

ABN, Publish Date - Oct 22 , 2024 | 07:35 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయంలో సందడి చేశారు. ఈ సందర్భంగా తాను కొత్తగా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారును రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫోటో దిగి, సంతకం చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. ఆ కారు రిజిస్టేషన్ కోసం మంగళవారం ఖైరతాబాద్‌లోని ఆర్టీఓ కార్యాలయానికి రామ్ చరణ్ వెళ్లారు. హీరో రామ్ చరణ్ రావడంతో ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. తన రోల్స్ రాయిస్ కారును రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ కారుకు TG 09 C 2727 నెంబర్‌ను రామ్ చరణ్ రిజిస్టర్ చేయించుకున్నారు.

Also Read: Bengaluru: కూలిన భవనం.. ఒకరు మృతి.. శిథిలాల కింద కార్మికులు


అందుకోసం రామ్ చరణ్ ఫొటో దిగి, డిజిటల్ సంతకం చేశారు. ఈ సందర్బంగా కార్యాలయంలో అధికారులు రామ్ చరణ్‌తో కలిసి ఫొటోలు దిగారు. మరోవైపు రామ్‌చరణ్‌ ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వస్తున్న విషయం ముందుగా ఆయన ఫ్యాన్స్ తెలుసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయానికి భారీ సంఖ్యలో ఆయన ఫ్యాన్స్ తరలి వచ్చింది. ఆ క్రమంలో తమ అభిమాన హీరోతో కలిసి వారు ఫొటోలు దిగారు. అందుకు సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ఇవి తింటే.. జుట్టు ఊడదు..

Also Read: IRCTC: శబరిమల యాత్రకు ప్రత్యేక రైలు


ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దీంతో చిత్ర నిర్మాణానంతరం పనులు జరుపుకుంటుంది. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రంగా తెరకెక్కింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. వీటికి విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రామ్ చరణ్‌ నటించనున్నారు.

Also Read: Viral Video: చిరుతపులిని కవ్వించారు.. అంతే.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

For Telangana News And Telugu News..

Updated Date - Oct 22 , 2024 | 07:35 PM