ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister: గతం కంటే ఘనంగా బోనాల ఉత్సవాలు...

ABN, Publish Date - Jun 21 , 2024 | 08:30 AM

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలపై ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

- అధికారులకు మంత్రి పొన్నం ఆదేశాలు

హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలపై ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరుపుకుంటున్న బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జిల్లా పరిధిలోని 2,400 ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీని త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈసారి డబ్బులు పెంచే విధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు.

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌..


నగరంలోని 28 ముఖ్యమైన దేవాలయాలకు ప్రజాప్రతినిధులు పట్టువస్ర్తాలు సమర్పిస్తారని, మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు బోనాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రధాన దేవాలయాల్లో హెల్త్‌క్యాంపులు, అంబులెన్స్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అన్నిశాఖలు సమన్వయంతో పనిచేసి బోనాలు పండుగను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌ ఆమ్రపాలి, అడిషనల్‌ సీపీ విక్రమ్‌ సింగ్‌మాన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, డీఆర్వో వెంకటాచారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


తోడ్పాటునందించాలి.. ముఖ్యమంత్రికి లాల్‌దర్వాజ ఆలయ కమిటీ ప్రతినిధుల వినతి

చాంద్రాయణగుట్ట/చార్మినార్‌: తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి లాల్‌దర్వాజ దేవాలయ కమిటీ ప్రతినిదులు వినతిపత్రం అందజేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, రాజ్యసభ సభ్యుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌తోపాటు ఆలయకమిటీ మాజీ చైర్మన్‌ కె.వెంకటేశ్‌, కన్వీనర్‌ జి.అరవింద్‌కుమార్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి ఎ.వినోద్‌కుమార్‌ తదితరులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి గురువారం వినతిపత్రం అందజేశారు. సీఎంను శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆలయ విస్తరణ పనులను త్వరగా చేపట్టాలని కోరారు. అలాగే.. భాగ్యనగర్‌ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్‌ గాజుల అంజయ్య ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం కూడా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా సత్కరించారు. ఈసారి జాతరను అత్యంత వైభవంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 08:30 AM

Advertising
Advertising