ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: భారీ వర్షాలు.. ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి దామోదర సమీక్ష

ABN, Publish Date - Sep 01 , 2024 | 01:41 PM

రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తుండటం, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarsimha) అధికారులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తుండటం, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarsimha) అధికారులతో సమావేశమయ్యారు. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో(Telangana Secretariat) ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.

వర్షాలు తగ్గే వరకు ఆసుపత్రుల్లో సిబ్బందికి సెలవులు మంజూరు చేయొద్దని డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్‌ను ఆదేశించారు. డాక్టర్లు, స్టాఫ్ అందరూ హెడ్‌ క్వార్టర్స్‌‌లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణులను ముందే హాస్పిటళ్లకు తరలించి, వెయిటింగ్ రూమ్స్‌ కేటాయించాలని ఆదేశించారు.


గర్భిణికి, ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలన్నారు. అంబులెన్స్ సర్వీసులు అన్ని చోట్ల అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. మెడిసిన్, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పేషెంట్లకు అందించే ఆహారం, తాగునీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలు తగ్గిన తర్వాత దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, తగ్గుముఖం పట్టిన వెంటనే జ్వరాలు విజృంభించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఇందుకోసం పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల హాస్టళ్లలో స్టూడెంట్స్‌కు అందజేసే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో పిల్లలకు అందించే భోజనం విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించేలా సంబంధిత శాఖ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు.

For Latest News click here

Updated Date - Sep 01 , 2024 | 01:42 PM

Advertising
Advertising