Minister: దసరాకు ‘డబుల్’ బొనాంజా..
ABN, Publish Date - Oct 02 , 2024 | 11:41 AM
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు దసరా పండుగ కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- అర్హులకు ఇళ్ల పంపిణీ, త్వరలో విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు దసరా పండుగ కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్లతో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Revenue Minister Ponguleti Srinivas Reddy) ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ‘డబుల్’ ఇళ్లను దసరా కానుకగా కేటాయిస్తామని ప్రకటించారు. లబ్ధిదారుల ఎంపిక విధివిధానాలను ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు.
ఇదికూడా చదవండి: Governor: హైడ్రా ఆర్డినెన్స్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
.................................................................
ఈ వార్తను కూడా చదవండి:
................................................................
Hyderabad: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య కేసులో కొత్త ట్విస్టు.. క్లాస్‌మేటే చంపేశాడు!
- పోలీసుల అదుపులో నిందితుడు ?
హైదరాబాద్ సిటీ: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని(Software employee) హత్య కేసులో కొత్త ట్విస్టు వెలుగులోకి వచ్చింది. ఆమె స్నేహితుడు, క్లాస్‌మేటే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. మియాపూర్ పోలీస్‌స్టేషన్(Miyapur Police Station) పరిధిలోని సీబీఆర్ ఎస్టేట్‌లో సోమవారం రాత్రి వివాహిత దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. స్పందన(29) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. ఇంటర్ చదువుతున్న సమయంలోనే వినయ్‌కుమార్‌ను ప్రేమించింది. 2022లో పెళ్లి చేసుకుంది. వినయ్‌కుమార్ ప్రముఖ చికెన్ సంస్థలో ప్రధాన అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్ఫర్థలు వచ్చాయి. భర్త వేధిస్తున్నాడంటూ 2023లో స్పందన మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరి మధ్య దూరం పెరగడంతో విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేశారు. స్పందన కుటుంబసభ్యులతో కలిసి సీబీఆర్ ఎస్టేట్స్‌లో ఉంటోంది. ఆమె తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా.. సోమవారం డ్యూటీకి వెళ్లింది. మధ్యాహ్నం సోదరి ఇంటికి వచ్చి తలుపుకొట్టగా తీయలేదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లి తలుపుకొట్టినా, ఫోన్ చేసినా తలుపు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో బద్దలు కొట్టి చూడగా హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉంది. వినయ్‌కుమార్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమెను అతడు చంపలేదని నిర్ధారించుకుని విడిచిపెట్టినట్లు సమాచారం.
రక్తపు దుస్తులు, స్ర్కూ డ్రైవర్‌ను గుర్తించి..
సైబరాబాద్ సీపీ ఆదేశాలతో ఎస్‌వోటీ, మియాపూర్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, కాల్‌డేటా ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మైహోమ్ అపార్టుమెంట్స్ సమీపంలో హత్య చేయడానికి వినియోగించిన స్ర్కూడ్రైవర్, రక్తాన్ని తుడిచినట్లు భావిస్తున్న దుస్తులు పడేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి మంగళవారం అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. అతడి పేరు మనోజ్‌కుమార్ యాదవ్ అని తెలిసింది.
ఇతరులతో సన్నిహితంగా ఉంటోందని..
భర్తతో విడిపోయిన తర్వాత స్పందన తన స్నేహితుడు, క్లాస్‌మేట్‌తో సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసింది. తనతో సన్నిహితంగా ఉంటూనే ఇతరులతోనూ క్లోజ్‌గా ఉంటున్నట్లు గుర్తించిన స్నేహితుడు ఆమెను హెచ్చరించాడు. పద్ధతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకొని స్పందనను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా ఉందని నిర్ధారించుకొని సోమవారం ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో, ఆమెను విచక్షణారహితంగా కొట్టి, స్ర్కూడ్రైవర్‌తో పొడిచి హత్య చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలంలో మృతురాలి రెండు దవడ పళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
ఇదికూడా చదవండి: హూక్కా సెంటర్‌పై పోలీసుల దాడులు..
ఇదికూడా చదవండి: రేవంత్ సర్కారు.. ఇక ఇంటికే
ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు
ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 02 , 2024 | 11:41 AM