Minister Jupalli Krishna Rao : కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం
ABN, Publish Date - May 14 , 2024 | 04:25 AM
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం: జూపల్లి
హైదరాబాద్, మే 13(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కొల్లాపూర్లోని బాలికల పాఠశాలలో సతీమణి సుజనతో కలిసి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
Updated Date - May 14 , 2024 | 04:25 AM