ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Telangana: అందరూ ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

ABN, Publish Date - Jan 14 , 2024 | 09:06 PM

నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో

నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 10 కోట్లతో హాస్టల్ నిర్మాణం, నల్లగొండ, ముషంపల్లి, కన్నెకల్ మీదుగా తిప్పర్తి వెళ్లేలా రూ.100 కోట్లతో చేపట్టబోయే రోడ్డు నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గుండ్లపల్లి నుంచి రేగట్ట వరకు రూ.30 కోట్లతో డబుల్ రోడ్డు పనులు, దర్వేశిపురం వయా దోరేపల్లి, పగిడిమర్రి వరకు రూ.34కోట్లతో రోడ్డు పనులు చేపడతామన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలను అందరూ ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. యాదాద్రి థర్మల్ పవర్ పాయింట్ ప్రాజెక్టుపై ఎంక్వయిరీ వేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు.

అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన వెల్లడించారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో నియంతృత్వ విధానాలను అవలంబించి, చెయ్యరాని తప్పులన్నీ చేసి.. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారపక్షంపై ఎదురుదాడి చేస్తోందని.. ఈ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చరించారు.

Updated Date - Jan 14 , 2024 | 09:06 PM

Advertising
Advertising