ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponnam: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావు..

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:10 PM

అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావని, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు.

- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌ సిటీ: అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావని, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులు బతకాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించడం ద్వారా సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పును గౌరవిస్తూ పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఖైరతాబాద్ గణేషుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్


ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, రసాయన విగ్రహాలతో వాతావరణ కాలుష్యంతో పాటు చిన్న వయసులోనే కేన్సర్‌, డయాబెటిస్‌, గుండె జబ్బులు, కిడ్నీసమస్యల బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. మట్టి విగ్రహాలను పూజించి కులవృత్తులను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు కదిరివన్‌, వెంకటాచారి, జిల్లా బీసీ వెల్ఫేర్‌ అధికారి ఆశన్న, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సురేష్‌బాబు, జిల్లా అధికారులు పెరికే యాదయ్య, జయశంకర్‌, ఆర్‌. కోటాజీ, సీపీఓ డాక్టర్‌ సురేందర్‌, వివిధ శాఖల ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.


................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..................................................................

Hyderabad: బాలాపూర్‌ గణేశ్‌.. వెరీ స్పెషల్‌

హైదరాబాద్: వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్‌ గణేష్(Balapur Ganesh)‏తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య రామాలయం తీరులో మండపాన్ని నిర్మిస్తున్నారు.


భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌ రెడ్డి తెలిపారు. కాగా, బాలాపూర్‌ లడ్డూకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. 1994లో రూ.450కు ప్రారంభమైన లడ్డూ వేలం గత సంవత్సరంలో రూ. 18.90 లక్షలు పలికింది. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పటి వరకు రూ.1,40,71,970లు వెచ్చించి ఆలయాల అభివృద్ధి, షెడ్డు నిర్మాణం, బోరు, వరద బాధితులకు సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 07 , 2024 | 12:10 PM

Advertising
Advertising