ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Ponnam: బోనాలకు ఘనంగా ఏర్పాట్లు: పొన్నం

ABN, Publish Date - Jun 16 , 2024 | 11:28 AM

బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.

హైదరాబాద్‌: బోనాల పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో ఆషాడ మాసం జంటనగరాల బోనాల జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha)తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి వసతి, మొబైల్‌ టాయిలెట్లు, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్‌లతో హెల్త్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బక్రీద్‌ సందర్భంగా.. మీరాలం దర్గా పరిసరాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు


అన్ని దేవాలయాలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించాలన్నారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu)తో కలిసి ఆయా దేవాలయాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. బక్రీద్‌కు కూడా అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఇతర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 11:28 AM

Advertising
Advertising