ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponnam Prabhakar: బోనాలకు సమన్వయంతో పనిచేయాలి..

ABN, Publish Date - Jun 26 , 2024 | 10:21 AM

బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) సూచించారు. జూలై 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది.

- ఎల్లమ్మ కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు

- సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్: బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar) సూచించారు. జూలై 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు, స్థానికులతో హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్లమ్మ కల్యాణ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత సంవత్సరం బోనాలకు రూ.15 కోట్లు ఇస్తే, ఈ సంవత్సరం దేవాదాయ శాఖ మంత్రి చొరవతో 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

ఇదికూడా చదవండి: Tummala Nageswara Rao :నాడు చేనేతలను పట్టించుకోలేదు


వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో జరిగే ఎల్లమ్మ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని వాటర్‌బోర్డు అధికారులకు సూచించారు. వీవీఐపీ పాసుల సంఖ్యను తగ్గించాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో మేయర్‌ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హన్మంతరావు, డీసీపీ విజయ్‌కుమార్‌, కార్పొరేటర్‌ సరళ, కోట నీలిమ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 10:21 AM

Advertising
Advertising