ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

ABN, Publish Date - Dec 13 , 2024 | 06:25 AM

టీజీ ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. అయినా మీలో మార్పు రాదా ? అంటూ మండిపడ్డారు.

  • ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారులపై మంత్రి సీతక్క ఆగ్రహం

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): టీజీ ఫుడ్‌ కార్పొరేషన్‌ అధికారుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. అయినా మీలో మార్పు రాదా ? అంటూ మండిపడ్డారు. టీజీ ఫుడ్‌ కార్పొరేషన్‌ టెండర్లు పిలవకుండా పలు పనులను ఇటీవల నామినేషన్‌ పద్ధతిలో కేటాయించింది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క సిబ్బంది తీరుపై గురువారం అసహనం వ్యక్తం చేశారు.


సంబంధిత అధికారులను సచివాలయంలోని తన చాంబర్‌కి పిలిపించి.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటనీ ప్రశ్నించారు. అలాగే, పదోన్నతులు, కారుణ్య నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Dec 13 , 2024 | 06:25 AM