Minister: వామ్మో.. మంత్రి పొన్నం అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, Publish Date - Nov 16 , 2024 | 06:56 AM
సమాజంలో అసమానతలను తొలగించడానికి, రుగ్మతలను రూపుమాపడానికి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను అడ్డుకునేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హెచ్చరించారు.
- సర్వేను అడ్డుకుంటే ఖబడ్దార్..
- కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి పొన్నం హెచ్చరిక
- 30 శాతం సర్వే పూర్తయిందని వెల్లడి
సికింద్రాబాద్: సమాజంలో అసమానతలను తొలగించడానికి, రుగ్మతలను రూపుమాపడానికి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను అడ్డుకునేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హెచ్చరించారు. సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కంటోన్మెంట్ సిక్‌విలేజీలోని హాకీ గ్రౌండ్‌ను మినీ స్టేడియంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి శుక్రవారం మంత్రి పొన్నం గ్రౌండ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేలో బ్యాంకు ఖాతా నంబర్ అడగడం లేదని, ఎవరైనా అడిగితే ఇవ్వొద్దని సూచించారు. కులం పేరు చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉన్నదని, సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. ఇప్పటివరకు 30 శాతం సర్వే పూర్తయ్యిందని, సమగ్ర సర్వే విజయవంతానికి కులసంఘాలు సహకరించాలని కోరారు.
ఈ వార్తను కూడా చదవండి: Transgender Scam: దోష నివారణ పేరిట ట్రాన్స్‌జెండర్ మోసం
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో మార్పులు ఉండవు: కంటోన్మెంట్ మీదుగా చేపడుతున్న రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రతిపాదించిన మేరకు రోడ్ల విస్తరణ జరుగుతుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు ఒకలా, మల్కాజిగిరి ఎంపీగా మరోలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రోడ్ల విస్తరణను కుదించాలని, నష్టపరిహారం విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం తగదని హితవుపలికారు.
సిక్‌విలేజీ హాకీ గ్రౌండ్‌ను మినీస్టేడియంగా అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ సిక్‌విలేజీ హాకీగ్రౌండ్‌ను స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించడంపై సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ సీఈవో మధుకర్‌నాయక్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, నాయకులు ముప్పిడి మధుకర్, శ్యామ్ సన్‌రాజు, అల్లాడి గౌరీశంకర్, బల్వంత్‌రెడ్డి, సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 16 , 2024 | 06:56 AM