MLA: ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం చేయాలి
ABN, Publish Date - Nov 29 , 2024 | 07:57 AM
పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి మారుతుంటాయని, అయితే.... వ్యవస్థ మాత్రం సక్రమంగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తున్నట్టు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్.శ్రీగణేష్(Cantonment MLA N. Sriganesh) అన్నారు.
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించ: ఎమ్మెల్యే శ్రీగణేష్
- వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి
సికింద్రాబాద్: పదవులు, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి మారుతుంటాయని, అయితే.... వ్యవస్థ మాత్రం సక్రమంగా పనిచేయాలనే సిద్ధాంతాన్ని తాను విశ్వసిస్తున్నట్టు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎన్.శ్రీగణేష్(Cantonment MLA N. Sriganesh) అన్నారు. ప్రజలు తనను గెలిపించినందున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి సంక్షేమానికి కృషిచేస్తానని, అందుకే సమాజంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సక్రమంగా పనిచేసేటట్టు చేయడమే తన లక్ష్యమని అన్నారు. మడ్‌ఫోర్టులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యంమత్తులో విషం తాగి ఇద్దరు మృతి
వారితో కలిసి భోజనం చేశారు. ఉపాధ్యాయులు హాజరు శాతాన్ని పరిశీలించారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ శాఖలను తాను సందర్శిస్తున్నానని, విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిర్లక్ష్యం చేసే వారిని తక్షణమే డిస్మి్‌సచేసేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి జీఓ తెప్పిస్తానని శ్రీగణేష్ తెలిపారు. అధ్యాపకులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, తద్వారా ఇతరులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందని అన్నారు.
ఉపాధ్యాయులు ఇంటి నుంచి టిఫిన్ బాక్సులు తీసుకురావద్దని, పిల్లలు తినే మధ్యాహ్న భోజనాన్నే వారు కూడా తినాలని, తద్వారా నాణ్యత లోపించకుండా ఉండడమే కాకుండా, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తాను చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, అందుకే సమాజం అభివృద్ధి చెందాలంటే వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని తపన పడుతుంటానని అన్నారు. కాగా పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు ఫోన్ చేయాలని విద్యార్థులకు శ్రీగణేష్ తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి పాఠశాల స్థితిగతులను వివరించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధింవచ్చని చెప్పారు.
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..
ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!
ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్ ఫ్యాక్టరీ పూర్తి
ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్, కేటీఆర్‌లది నా స్థాయి కాదు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 29 , 2024 | 07:57 AM