ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA: ఎమ్మెల్యే అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN, Publish Date - Dec 07 , 2024 | 09:04 AM

కాంగ్రెస్‌ పాలన ఆనాటి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపిస్తుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌(Musheerabad MLA Mutha Gopal), బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎం.నాగేష్‌ ముదిరాజ్‌ ఆరోపించారు.

- ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్‌ పాలన

- ఎమ్మెల్యే ముఠా గోపాల్‌

హైదరాబాద్: కాంగ్రెస్‌ పాలన ఆనాటి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపిస్తుందని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌(Musheerabad MLA Mutha Gopal), బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎం.నాగేష్‌ ముదిరాజ్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరె్‌స్టకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌(BRS) నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గూగుల్‌లో వెతికి.. సైబర్‌ నేరగాళ్లకు చిక్కి..


ఇందులో భాగంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఎం.నాగేష్‌ ముదిరాజ్‌లను శుక్రవారం ఉదయం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వెళ్లకుండా అక్రమ అరెస్ట్‌ చేయడం దారుణమని అన్నారు. రానున్న రోజుల్లో ప్రజలే కాంగ్రెస్‌ పార్టీకి బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు.


అక్రమ గృహనిర్బంధం అప్రజాస్వామికం: జైసింహ

చిక్కడపల్లి: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా గృహనిర్బంధం చేయడం అప్రజాస్వామికమని బీఆర్‌ఎస్‌ యువనేత ముఠా జైసింహ అన్నారు. శుక్రవారం గాంధీనగర్‌ డివిజన్‌ జవహర్‌నగర్‌లో అంబేడ్కర్‌కు నివాళులు అర్పించేందుకు వెళుతున్న ముఠాజైసింహతో పాటు ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.


ముఠా జయసింహతో పాటు బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షులు రాకేశ్‌కుమార్‌, వల్లాల శ్యామ్‌యాదవ్‌, శ్రీధర్‌రెడ్డి, వై.శ్రీనివా్‌సరావు, శంకర్‌ముదిరాజ్‌, శ్రీనివా్‌సరెడ్డి, నేతలు వల్లాల శ్రీనివా్‌సయాదవ్‌, అరుణ్‌, ఎర్రం శ్రీనివా్‌సగుప్తా, పున్న సత్యనారాయణ, శ్రీకాంత్‌ యాదవ్‌, దీన్‌దయాల్‌రెడ్డి, మహ్మద్‌ అలీ, సురేందర్‌, యూనిస, చందు, పాశం రవి, సాయికుమార్‌, ప్రభాకర్‌, శ్రీకాంత్‌యాదవ్‌, సాయియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 09:04 AM